యాప్నగరం

మిత్రదేశం హోదా నుంచి పాక్ ఔట్ ?

సింధు జలాల అంశాన్ని తెరపైకి తెచ్చి పాక్ కు షాకిచ్చిన భారత్ ..తాజాగా మరో వ్యూహాన్ని సిద్ధం చేసింది.

TNN 27 Sep 2016, 7:08 pm
సింధు జలాల అంశాన్ని తెరపైకి తెచ్చి పాక్ కు షాకిచ్చిన భారత్ ..తాజాగా మరో వ్యూహాన్ని సిద్ధం చేసింది. భారత్‌లో పాక్‌కు ఉన్న మిత్రదేశం హోదాను తొలగించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు కూడా ప్రారంభించారు. 1996లో పాకిస్తాన్ కు భారత మిత్రదేశం హోదా లభించింది. ఈ హోదా లభించినప్పటి నుంచి పాక్ ..భారత్ తో సమానమైన వాణిజ్యప్రయోజనాలు పొందుతోంది. వీటితో పాటు అనేక ఆర్ధికపరమైన ప్రయోజనాలు అందుతున్నాయి. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ కు ఈ హోదా తొలగిస్తే ఆ దేశం ఆర్ధికంగా మరింత బలహీనపడతుందని మోడీ అంచనా వేస్తున్నారు.. అందుకే ఆయన ఈ దిశగా అడుగులు వేస్తున్నారు..
Samayam Telugu another time india given the shock to pakistan
మిత్రదేశం హోదా నుంచి పాక్ ఔట్ ?


పాక్ ప్రోత్సాహంతోనే యూరీ సైనిక స్థావరం పై ఉగ్రమూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలకు అడ్డుకట్టవేసేందుకు భారత్ తన ముందున్న అన్ని మార్గాలను వెతుకుతోంది. అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరి చేస్తేనే పాకిస్తాన్ దారికి వస్తుందని మోడీ సర్కార్ భావిస్తోంది. దీన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా మోడీ సర్కార్ ఇలాంటి చర్యలు ప్రారంభించింది. కాగా పాక్ ను ఒంటరి చేసే వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 29న ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రధాని మోడీ ..పాక్  విషయంలో అమలు చేసే వ్యూహాల పై  నిర్ణయం తీసుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.