యాప్నగరం

పాకిస్థాన్‌కు సౌదీ సూటి ప్రశ్న.. నీ దారేటు?

గల్ఫ్ దేశాల్లో తలెత్తిన దౌత్య సంబంధాల పరిష్కారం కోసం సౌదీలో పర్యటించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.

Samayam Telugu 14 Jun 2017, 6:12 pm
మీ పయనం తీవ్రవాదానికి ఊతమిచ్చే ఖతార్‌తోనా? మాతోనా? అంటూ సౌదీ రాజు సల్మాన్ పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ను సూటిగా ప్రశ్నించాడు. గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన దౌత్యపరమైన సమస్యలను పరిష్కారం కోసం జెడ్డాలో సౌదీ రాజుతో సమావేశమైన నవాజ్ షరీఫ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైనట్లు ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ పత్రిక కథనం ప్రచురించింది. మధ్య ఆసియాలో తలెత్తిన దౌత్యపరమైన సమస్యల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకోదని నవాజ్ పేర్కొంటే, మీరు ఎవరితో ఉంటారని సౌదీ రాజు సల్మాన్ ప్రశ్నించారని తెలిపింది. తీవ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తుందంటూ ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు నాలుగు గల్ఫ్ దేశాలు ప్రకటించిన తర్వాత పాకిస్థాన్ జాగ్రత్త అడుగులు వేస్తోంది. కానీ సౌదీ మాత్రం పాక్ తన వైఖరి తెలియజేయాలంటూ డిమాండ్ చేసింది.
Samayam Telugu are you with us or with qatar saudi king asks pakistan pm
పాకిస్థాన్‌కు సౌదీ సూటి ప్రశ్న.. నీ దారేటు?


జెడ్డాలో జరిగిన చర్చల సారాంశం గురించి సీనియర్ అధికారులు వివరించిన విషయాలను ఆ పత్రిక తెలిపింది. ముస్లిం ప్రపంచంలోని విబేధాలు సృష్టించే వైపు పాక్ ఉండదని స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్ తన పలుకుబడిని ఉపయోగించి ఖతార్‌‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చిందని ఆ పత్రిక తెలియజేసింది. దీని కోసం నవాజ్ షరీఫ్ కువైట్, ఖతార్, టర్కీలో పర్యటిస్తారని పేర్కొంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, కొంతమంది ఉన్నతాధికారులు కూడా నవాజ్ షరీఫ్‌తోపాటు పర్యటనలో పాల్గొన్నారు. షరీఫ్ మధ్యవర్తిత్వం కోసం చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.