యాప్నగరం

కరోనా వైరస్‌తో 50 మంది డాక్టర్లు మృతి.. ఇటలీలో మరో విషాదం

కరోనా వైరస్‌ కారణంగా ఎక్కువ మరణాలు సంభించిన ఇటలీ దేశంలో మరో విస్తుపోయే వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందించిన 50 మంది డాక్టర్లు కూడా చనిపోయినట్లు తాజాగా తెలిసింది.

Samayam Telugu 30 Mar 2020, 10:50 am
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7లక్షలు దాటిందంటేనే దాని ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోంది. చిన్న దేశాల నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు అన్ని దేశాలను ఈ మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు పుట్టిల్లు అయిన చైనాను వదిలేసి ఇటలీ, బ్రిటన్, అమెరికాలో తిష్ట వేసింది. భారత్‌లోనూ ఈ వైరస్ రోగుల సంఖ్య వేయి దాటినా.. 21రోజుల లాక్‌డౌన్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో లక్షా 40వేల మందికి పైగా దీని బారిన పడితే.. ఇటలీలో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లను కూడా బలి తీసుకుంటోంది.
Samayam Telugu italy


Also Read: 11వేల మంది సెక్స్‌వర్కర్లుండే రెడ్‌లైట్ ఏరియా... కరోనా ఎఫెక్ట్‌తో నేడు నిర్మానుష్యం

కరోనా వైరస్ కారణంగా ఇటలీలో ఇప్పటివరకు 10,779 మంది చనిపోయారు. మరణాల సంఖ్యలో ఆ దేశానిదే అగ్రస్థానం. అక్కడ కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో ఇప్పటివరకు 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్లు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ తెలిపింది.

Also Read: అల్లరి చేస్తున్నాడని ప్రియురాలి కొడుకుని కొట్టి చంపేశాడు... కర్నూలులో కిరాతకం

కరోనా పేషెంట్లకు చికిత్స చేసే సమయంలో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని సంస్థ ప్రెసిడెంట్ ఫిలిప్పో అనెల్లీ అభిప్రాయపడుతున్నారు. ఇటలీలో మొత్తం 7,100 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడినట్లు ఆయన తెలిపారు. ఇటలీలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన లాంబార్డీ ప్రాంతంలోనే 17 మంది డాక్టర్లు చనిపోయినట్లు సమాచారం.

Also Read: కరోనాతో దాదాపు 2లక్షల మంది అమెరికన్లు బలవుతారు: యూఎస్ అధికారి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.