యాప్నగరం

నవ్వు మొహంతో పుట్టిన పాపాయి.. అదే పెద్ద శాపమంట..!

ఆస్ట్రేలియాలో ఓ పసిపాప.. నవ్వుతూ పుట్టింది. దాంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అయితే పరిశీలించిన డాక్టర్లు అది పెద్ద లోపమేనని గుర్తించారు. ఓ అరుదైన జన్యపరమైన లోపం కారణంగా పాపాయి అలా పుట్టిందని తెలియజేశారు. ఆ పాపం జీవితాంతం అలా నవ్వు మొహంతోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు కేవలం 14 మాత్రమే ఉండడం మరో విశేషం. ఈ పాపే 14వ కేసు. అయితే పాప పరిస్థితిని డాక్టర్లు పరిశీలిస్తూనే ఉన్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 28 May 2022, 6:19 pm
Samayam Telugu నవ్వు మొహంతో పుట్టిన పాపాయి.. అదే పెద్ద శాపమంట..!
పసిపిల్లలు నవ్వుతుంటే ముచ్చటగా ఉంటుంది. అందుకే వారిని నవ్వించడానికి తంటాలు పడుతుంటారు. కానీ ఓ బుజ్జాయికి మాత్రం ఆ నవ్వే శాపమైంది. ఆస్ట్రేలియాలో ఓ పసిపాప జన్మించడమే అందమైన నవ్వు మొహంతో పుట్టింది. అలా నవ్వుతూనే పుట్టడం ఒక లోపం అంట. ఆ పాపను చూసిన వైద్యులు సైతం షాక్ అయ్యారు. బైలేటరల్ మాక్రోస్టోమియా అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల పాప నవ్వు మొహంతోనే పుట్టినట్టు డాక్టర్లు వెల్లడించారు. అలా జీవితాంతం ఆ నవ్వు మొహంతోనే ఆ అమ్మాయి ఉండాలంటున్నారు.

దక్షిణ ఆస్ట్రేలియాలోని క్రిస్టినా వెర్చర్, బ్లేజ్ ముచా దంపతులకు 2022 డిసెంబర్‌లో ఐలా జన్మించింది. అయితే పుట్టినప్పుడు పాప ఏడ్వలేదు. పైగా నవ్వుతూ ఉంది. పెదాలు సాగి అసాధారణంగా ఉంది. దాంతో తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. అయితే వైద్యులు పరిశీలించి పాపాయికి బైలెటరల్‌ మాక్రోస్టోమియా ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు 14 మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఎయిలాది 14వ కేసుగా వైద్యులు నిర్ధారించారు. అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏడో వారంలో కణజాలాల వల్ల ఈ స్థితి ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు.

View this post on Instagram A post shared by CRISTINA KYLIE VERCHER 🌙 (@cristinakylievercher_)

దీనికి ఏదైనా పరిష్కారం ఉందని డాక్టర్లను అడిగితే... ఇప్పుడు సర్జరీ చేస్తే సాధారణ పరిస్థితికి రావొచ్చని, కానీ.. పెద్దయ్యాక మళ్లీ ఇప్పుడున్న స్థితే వచ్చేస్తుందని అంటున్నారు. దాంతో ఐలా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆమె పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తున్నారు. మరోవైపు ఐలా నవ్వు మొహం ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఆమె చిరునవ్వుతో చాలామంది హృదయాలను గెలుచుకుంది. అయితే బిడ్డ పరిస్థితిపై కొందరు యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దాంతో పాపాయి తల్లి నా బిడ్డకు నవ్వే వరమని అంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.