యాప్నగరం

చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట నిరసన

లండన్ లోని చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట ఫ్రీ బలూచిస్థాన్ మూమెంట్ (ఎఫ్ బీఎం) ఆధ్వర్యంలో నిరసన మొదలైంది. వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 1 వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించనున్నారు.

TNN 26 Sep 2016, 5:46 am
లండన్ లోని చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట ఫ్రీ బలూచిస్థాన్ మూమెంట్ (ఎఫ్ బీఎం) ఆధ్వర్యంలో నిరసన మొదలైంది. వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 1 వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించనున్నారు. బలూచిస్థాన్‌ లో తలపెట్టిన పాకిస్థాన్‌-చైనా ఎకనామిక్‌ కారిడర్‌ ని అడ్డుకోవడంలో భాగంగా తమ నిరసన కొనసాగుతుందని ఎఫ్ బీఎం పేర్కొంది. ఎఫ్ బీఎం సభ్యులతో పాటు బెలూచిస్థాన్ ఉద్యమకారులు సెప్టెంబర్ 30 వరకు చైనా ఎంబసీ కార్యాలయం ఎదుటే కూర్చొని నిరసన కొనసాగించనున్నారు. ఇక అక్టోబర్ 1న చైనా నేషనల్ డే కాబట్టి ఆ రోజున ఎంబసీ ఔట్ సైడ్ లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిరసన చేపట్టనున్నారు. చైనా 21 శతాబ్దంలో బలూచిస్థాన్ మరో ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పుతోందని ఎఫ్ బీఎం పేర్కొంది. పాకిస్థాన్ సాయంతో బెలూచిస్థాన్ లోని సహజవనరులు మొత్తాన్ని కూడా నాశనం చేయనుందన్నారు.
Samayam Telugu baloch activists to stage week long protest in london against china pakistan nexus
చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట నిరసన


చైనాలోని కాష్గర్‌ నుంచి బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌ ఓడరేవు వరకు రెండువేల కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న సీపీఈసీతో పాకిస్థాన్‌ రూపురేఖలు మారిపోతాయని భావిచడం సరికాదన్నారు. తమ నిరసనలో బాలూచ్ ఉద్యమకారులు, మానవ హక్కుల సంఘం నేతలు, ఎఫ్ బీఎం ఉద్యమకారులు పాల్గొంటారని ఎఫ్ బీఎం నేత ఫైజ్ బాలూచ్ తెలిపారు. జులైలో జర్మనీలో నిరసన తెలిపిన తాము తర్వాత న్యూయార్క్ లో అనంతరం లండన్ లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. అలాగే ఇతర దేశాల్లోనూ తమ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.

The Free Balochistan Movement (FBM) will organize a sit-in protest in front of the Chinese Embassy in London starting today and ending on October 1. The focus of the week-long campaign is the alleged plundering of Balochistan's natural resources by the China-Pakistan "nexus," the FBM said in a statement on Sunday.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.