జర్మనీ టైం అస్సలు బాగున్నట్టు లేదు. పది రోజుల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు బాంబు దాడులతో, తుపాకి పేలుళ్లతో రక్తసిక్తమవుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలోని బెర్లిన్ నగరంలో సిరియా శరణార్థి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అక్కడి కాలమానం ప్రకారం... ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బార్ ప్రాంగణంలోకి వచ్చి తనని తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు దాడి జరిగిందని తెలిసిన వెంటనే మ్యూజిక్ ఫెస్టివర్ జరుగుతున్న ప్రాంతం నుంచి 2,500 మందిని పంపించేశారు. వారం రోజుల క్రితం జర్మనీలోని ఓ రైల్లో గొడ్డలితో దాడి చేసి ప్రయాణికులను గాయపరిచాడు. రెండు రోజుల క్రితం మ్యూనిచ్ లో ఓ దుండగుడు ఫుడ్ కోర్టులోకి వెళ్లి విచక్షణా రహితంగా కాల్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో 9 మంది మరణించారు.
జర్మనీలో ఆత్మాహుతి దాడి
జర్మనీ టైం అస్సలు బాగున్నట్టు లేదు.
TNN 25 Jul 2016, 8:59 am