యాప్నగరం

చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్.. పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్!

జి జిన్‌పింగ్ చైనా శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ రాజ్యాంగ సవరణకు ఆమోద ముద్ర వేసింది.

TNN 11 Mar 2018, 4:15 pm
చైనా అధ్యక్షుడిగా జి జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మావో, డెంగ్ తరహాలోనే జిన్‌పింగ్ విశిష్ట నేతగా ఎదిగారు. అధ్యక్ష పీఠంపై పదేళ్లు మాత్రమే కొనసాగాలనే పరిమితిని ఎత్తివేస్తూ.. రాజ్యాంగ సవరణ చేయగా.. చైనా పార్లమెంట్ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. గత 14 ఏళ్లలో చైనా రాజ్యాంగాన్ని సవరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Samayam Telugu china clears way for president xi jinping to rule for life as parliament abolishes presidential term limits
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్.. పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్!


జిన్‌పింగ్ తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా నియమితులైన ఇద్దరు నేతలు నిబంధనలకు అనుగుణంగా రెండు పర్యాయాల గడువు ముగిసిన వెంటనే తప్పుకున్నారు.

64 ఏళ్ల జిన్‌పింగ్‌ చైనా అధ్యక్ష బాధ్యతలతోపాటు.. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) చీఫ్‌‌గా, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ​ తాజా రాజ్యాంగ సవరణతో మరణించే వరకూ ఆయనే ఆ దేశ అధ్యక్ష పీఠంపై కొనసాగనున్నారు.

గతంలో మావో జెడాంగ్ మాత్రమే చైనా శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన 1949 నుంచి 1976 వరకు చైనాను పాలించారు. తర్వాతి కాలంలో ఏ ఒక్కరూ సుదీర్ఘ కాలంపాటు అధ్యక్ష స్థానంలో కొనసాగొద్దనే ఉద్దేశంతో.. డెంగ్ జియాపింగ్ 35 ఏళ్ల క్రితం ‘రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాల’నే నిబంధన తీసుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.