యాప్నగరం

Tawang Clash చైనా యుద్ధ సన్నాహం.. భారీగా విమానాలు, డ్రోన్‌ల మోహరింపు!

Tawang Clash డిసెంబరు 9న చైనా బలగాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్‌లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయగా.. భారత్ సైన్యం వారి అడ్డుకుని దీటుగా బదులిచ్చింది. ఈ ఘర్షణ తర్వాత ఇరు సైన్యాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయి. అయితే, ఈ ఘటన తర్వాత డ్రాగన్.. యుద్ధ సన్నాహాలను ప్రారంభించిందని, అరుణాచల్‌కు సమీపంలోని చైనా వైమానిక స్థానంలో యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరించినట్టు మాక్సర్ టెక్నాలజీ ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 19 Dec 2022, 4:27 pm

ప్రధానాంశాలు:

  • భారీగా యుద్ధ విమానాలు మోహరించిన చైనా
  • బ్యాంగ్డా ఎయిర్‌బేస్‌లో డ్రాగన్ సోరింగ్ డ్రోన్లు
  • తవాంగ్ ఘర్షణ తర్వాత పెరిగిన కార్యకలాపాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu China India Clashes
Tawang Clash అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణ తర్వాత పొరుగు దేశం భారీగా ఆయుధాలు, విమానాలతో యుద్ధానికి సన్నద్ధం చేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అరుణాచల్‌కు సమీపంలోని అతిపెద్ద టిబెట్ వైమానిక స్థావరం వద్ద భారీ సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను చైనా సిద్ధం చేసినట్టు శాటిలైట్ ఫోటోల ఆధారంగా సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా కార్యకలాపాలు పెరిగినందున భారత వైమానిక దళం అరుణాచల్ ప్రదేశ్ గగనతలంలో యుద్ధ విమాన గస్తీని నిర్వహిస్తున్నట్టు మాక్సర్ టెక్నాలజీ ఉపగ్రహ ఫోటోలు వెల్లడించాయి. అరుణాచల్ మీదుగా భారత గగనతలంలోకి చైనా విమానాలు ప్రవేశించి అవకాశం ఉందని గుర్తించిన తర్వాత భారత వాయుసేన కనీసం రెండు సందర్భాల్లో యుద్ధ విమానాలను ఎగురవేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దులకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంగ్డా ఎయిర్‌‌బేస్‌‌లో సోరింగ్ డ్రాగన్ డ్రోన్లను చైనా మోహరించింది. నిరాటంకంగా పది గంటల పాటు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్లను చైనా అధికారికంగా గతేడాది మొదటిసారి అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇంటెలిజెన్స్, పర్యవేక్షణ, నిఘా మిషన్ల కోసం రూపొందించారు. క్రూయిజ్ క్షిపణులకు భూ ఉపరితల లక్ష్యాలను చేధించడానికి సమాచారాన్ని కూడా అందజేయగలవు.

‘‘ఈశాన్య భారత ప్రాంతంలోని మెక్‌మాన్ రేఖ చుట్టూ అక్సాయ్ చిన్ మీదుగా మిషన్‌లకు మద్దతు ఇవ్వడానికి క్రియాశీల, పూర్తిగా పనిచేసే నెట్‌వర్క్ వాతావరణం ఏర్పాటు చేయడం వారి ప్రేరణ, కార్యాచరణ సన్నద్ధతను సూచిస్తోంది’’ అని ఐఏఎఫ్ యుద్ధ విమానం మాజీ పైలట్, న్యూస్పేస్‌కు చెందిన సమీర్ జోషి అన్నారు. మరో మాటలో చెప్పాలంటే, చైనాలు డ్రోన్‌లు భారత భూ స్థావరాలను ఖచ్చితంగా పర్యవేక్షించడానికి వీలు కల్పించే వారి వైమానిక దళం సమీకృత వ్యవస్థలో భాగం. ఈ స్థావరాలను ఇతర డ్రోన్లు లేదా క్షిపణులు, ఇతర ఆయుధాలతో యుద్ధ విమానాల ద్వారా లక్ష్యంగా చేసుకోవచ్చు.

‘‘ఇటీవల ఇతర నివేదికలతో పాటు ఉపగ్రహ చిత్రాలు గమనించిన వాటి ప్రకారం.. వివాదాస్పద ప్రాంతాలలో భారతీయ కదలికలను పర్యవేక్షించడానికి చైనా ఉపయోగించగల విస్తృత శ్రేణి దీర్ఘకాలిక వేదికలను తెలియజేస్తుంది’’ అని టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలను నిశితంగా గమనించే ఫోర్స్ అనాలిసిస్‌కి చెందిన సైనిక విశ్లేషకుడు సిమ్ టాక్ చెప్పారు. ముఖ్యంగా 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత ఈ ప్రాంతంలో చైనా వైమానిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఖచ్చితంగా భారత వైమానిక దళం, దాని స్థావరాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.. భవిష్యత్తులో ముప్పుగా పరిణమించవచ్చు’’ అని అన్నారు.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.