యాప్నగరం

ప్రపంచ దృష్టిలో చైనా దోపిడీకి చోటు లేదు.. అమెరికా సంచలన ప్రకటన

దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబవాన్ని మరింత పెంచుకోడానికి ప్రయత్నిస్తూ.. వివాదాస్పద ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది.

Samayam Telugu 15 Jul 2020, 2:46 pm
భారత్, చైనా సైనికుల మధ్య జూన్ 15న గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తమ జవాన్ల విషయంలో డ్రాగన్ అత్యంత దారుణంగా వ్యవహరించింది. సరిహద్దు ఘర్షణలో జరిగిన ప్రాణనష్టాన్ని కప్పిపుచ్చుకోవడంలో పాకిస్థాన్‌ను చైనా ఆదర్శంగా తీసుకోవడం దురదృష్టకరం. ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అమెరికా సహా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
Samayam Telugu చైనాపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
US China Cold War


దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడుపై తీవ్రంగా స్పందించిన అమెరికా... ప్రపంచ దృష్టిలో చైనా దోపిడీకి 21వ శతాబ్దంలో చోటు లేదని నిర్మొహమాటంగా స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలో వనరులపై చైనా వాదనలను తిరస్కరించింది. విస్తరణవాద యుగం ముగిసిందని లడఖ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సమాంతరంగా ఈ ప్రకటన కనిపించింది.

దక్షిణ చైనా సముద్రాన్ని తన సామ్రాజ్యంగా పరిగణించడానికి చైనాను ప్రపంచం అనుమతించదు. సముద్రాల స్వేచ్ఛ, సార్వభౌమత్వాన్ని గౌరవించడంలో తాము అంతర్జాతీయ సమాజం వెంట నిలబడతాం... దక్షిణ చైనా సముద్రంలో లేదా విస్తృత ప్రాంతంలో ఏ విధమైన చర్యలను అంగీకరించబోమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని కీలకమైన, వివాదాస్పదమైన భాగం దక్షిణ చైనా సముద్రంలో అమెరికా విధానాన్ని బలపరుస్తున్నాం... దక్షిణ చైనా సముద్రం అంతటా ఆఫ్‌షోర్ వనరులపై బీజింగ్ చేసిన వాదనలు పూర్తిగా చట్టవిరుద్ధం.. మా మిత్రదేశాలు, భాగస్వాములతో లోతైన, స్థిరమైన ఆసక్తులను పరిగణనలోకి తీసుకుంటాం.. అని పాంపియో అన్నారు.

అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం.. జూన్‌లో భారత్ సైన్యంతో జరిగిన ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలపై చైనా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దీనిని కప్పిపుచ్చే ప్రయత్నంలో అంత్యక్రియల వేడుకలు నిర్వహించవద్దని చెప్పడం తన తప్పును పరిగణించినట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో పాక్‌ను ఆదర్శంగా తీసుకుంది. ఇది కార్గిల్ యుద్ధంలో కోల్పోయిన తన సైనికులను గుర్తించడానికి పాక్ నిరాకరించింది.

ప్రస్తుతం చైనా కూడా అదే పంథాను అనుసరించింది. దేశం కోసం అమరులైన జవాన్లను సంప్రదాయ పద్ధతిలో ఖననం చేయకుండా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల కథనం. ఇందుకోసం జవాన్ల కుటుంబ సభ్యులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. చైనా సంప్రదాయ పద్ధతిలో ఖననం చేయకుండా.. అనాథ శవాలకు నిర్వహించినట్టు.. రహస్యంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేయించినట్లు తెలుస్తోంది. దీనికి కరోనా వైరస్ వ్యాప్తిని బూచీగా చూపిందట.

జవాన్ల మృతదేహాలను ఎవరికీ తెలియకుండా దహనం చేయాలని వారి కుటుంబ సభ్యులను చైనా ప్రభుత్వం బెదిరించింది. అంతేకాకుండా.. వారికి సంబంధించిన గుర్తులేవీ లేకుండా చేయాలని ఆదేశించిందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలను కూడా వివరించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.