యాప్నగరం

అందుకే ట్రంప్‌నకు మధ్య వేలి చూపించా...!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కాన్వాయ్‌‌తో గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్న సమయంలో ఆయనకు మధ్య వేలి చూపించిన మహిళ జూలీ బ్రిస్క్‌మ్యాన్ ఉద్యోగం ఊడిపోయిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 12 Nov 2017, 11:46 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కాన్వాయ్‌‌తో గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్న సమయంలో ఆయనకు మధ్య వేలి చూపించిన మహిళ జూలీ బ్రిస్క్‌మ్యాన్ ఉద్యోగం ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఆమె వివరణ ఇచ్చారు. తాను ఒక సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌‌గా పనిచేస్తున్నానని తెలిపారు. ట్రంప్ అసంబద్ధమైన నిర్ణయాల వల్ల రక్తం మరిగి నిరసన తెలపాలన్న లక్ష్యంతో ప్రణాళిక ప్రకారమే అలా ప్రవర్తించానని తెలియజేశారు. హెల్త్ పాలసీతోపాటు వివిధ అంశాలపై అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసంగా లేవని ఆమె అభిప్రాయపడ్డారు.
Samayam Telugu cyclist lost her job after raising middle finger at trumps motorcade
అందుకే ట్రంప్‌నకు మధ్య వేలి చూపించా...!


అందుకే ట్రంప్‌నకు తన నిరసన తెలపాలని నిర్ణయించుకున్నానని జూలీ అన్నారు. దీంతో అక్టోబరు 28 న ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు వస్తారని తెలిసి, ఆ దారిలోనే ఆయన కోసం ఎదురుచూసానని అన్నారు. సరిగ్గా ట్రంప్ వచ్చినప్పుడు మధ్యవేలు చూపించి, తన నిరసన తెలియజేశానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను మీడియాతోపాటు వైట్‌‌హౌస్ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మాన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు వెళ్లినప్పుడల్లా తన పేరు చర్చించుకోవాలని భావించి, రెండు రోజుల తరువాత ఫేస్‌ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఆ ఫొటోను ప్రొఫైల్ పిక్‌‌గా అప్‌ డేట్ చేశానని ఆమె తెలిపారు.

ఉద్యోగం పోయిన తర్వాత వివాదం పెద్దదవుతుందని భావించి, జాతీయ మానవహక్కుల సంస్థకు వెళ్లి అక్కడ ఉద్యోగిని కలిసి, ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా వేలు చూపించిన మహిళ ఎవరో తెలుసా? అని అడిగానని అన్నారు. తెలియదని చెప్పడంతో ఆ వ్యక్తిని తానేనని పరిచయం చేసుకున్నానని ఆమె తెలిపారు. ట్రంప్‌ను వేలి చూపించి నిరసన తెలియజేసిన తనను ప్రభుత్వ కాంట్రాక్టులు రావన్న భయంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదు చేశానని, మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నానని ఆమె అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.