యాప్నగరం

దావూద్ ఇబ్రహీం మృతిపై పాకిస్థాన్‌లో వదంతులు

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్రమైన గుండెపోటుతో పాకిస్థాన్‌లోని కరాచీలో అగా ఖాన్ హాస్పిటల్‌లో...

TNN 29 Apr 2017, 10:48 am
అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్రమైన గుండెపోటుతో పాకిస్థాన్‌లోని కరాచీలో అగా ఖాన్ హాస్పిటల్‌లో చేరాడని పాక్ మీడియాలో పలు వార్తా కథనాలు వచ్చాయి. ఈ వార్తా కథనాల అనంతరం దావూద్ ఇబ్రహీం ఇక లేడు అంటూ పలు వదంతులు సైతం వ్యాపించాయి.
Samayam Telugu dawood ibrahim is no more is a false news chhota shakeel
దావూద్ ఇబ్రహీం మృతిపై పాకిస్థాన్‌లో వదంతులు


ఇదిలావుంటే, ఈ వదంతులపై స్పందించిన దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్... అందులో నిజం లేదని కొట్టిపారేశాడు. కరాచీ నుంచి ఫోన్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన చోటా షకీల్... దావూద్ భాయ్ లేడనే వార్తలన్నీ పుకార్లేనని స్పష్టంచేశాడు. "ఒకవేళ అదే నిజమైతే నా గొంతులో మీకు తేడా కనిపించదా ? నా వాయిస్ వింటుంటే మీకు భాయ్ లేడని ఇంకా సందేహంగానే వుందా" అని ప్రశ్నించివ షకీల్.. 'భాయ్‌కి ఏమీ కాలేదు. అతడు నిక్షేపంగా వున్నాడు' అని తేల్చిచెప్పాడు.

61 ఏళ్ల దావూద్ ఇబ్రహీం గత కొంత కాలంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలోనే తీవ్రమైన గుండెపోటుతో దావూద్ కరాచీలోని అగా ఖాన్ హాస్పిటల్‌లో చేరాడని పాక్ మీడియాలో పలు వార్తా కథనాలు వెలువడటమే ఈ వదంతులకి కారణమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.