యాప్నగరం

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: 27 మంది మృతి

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. షియాలే లక్ష్యం తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

TNN 21 Nov 2016, 3:23 pm
అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 27 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ దాడిలో 35 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. దారుల్ అమన్ ప్రాంతంలోని షియాలకు చెందిన బకీర్ ఉల్ ఓలూమ్ మసీదులో ప్రార్థనల కోసం సిద్ధమవుతుండగా అందులోకి ప్రవేశించిన తీవ్రవాది తనను తాను పేల్చుకున్నాడని పోలీస్ ఉన్నతాధికారి అబ్దుల్ రహ్మాన్ రహీమ్ తెలిపారు.
Samayam Telugu deaths as suicide bomber attacks shia mosque in kabul
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: 27 మంది మృతి


ఆ ప్రాంతానికి భద్రతా సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అంతే కాకుండా గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారని తెలియజేశారు. గత జులైలో కూడా షియాలే లక్ష్యంగా ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబు దాడిచేసి 80 మందిని పొట్టనబెట్టుకున్నారు. మైనార్టీ వర్గమైన షియాలే లక్ష్యంగా తీవ్రవాదులు దాడులు జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.