యాప్నగరం

కెనడా: సభ నుంచి భారతీయ సిక్కు బహిష్కరణ.. ప్రతిపక్ష నేతకు ప్రధాని ట్రూడో మద్దతు!

కెనడా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ప్రాతినిథ్యం వహిస్తున్న భారతీయ సిక్కు జగ్మీత్ సింగ్‌ను కొద్ది రోజుల పాటు బహిష్కరించారు. దీనిపై కెనడా ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేస్తారు.

Samayam Telugu 19 Jun 2020, 11:58 am
జాత్యహంకార ఆరోపణలు చేసినందుకు కెనడా పార్లమెంట్‌లో భారతీయ సిక్కు సభ్యుడు జగ్మీత్ సింగ్‌ గురువారం తాత్కాలికంగా బహిష్కరణకు గురయ్యారు. అయితే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతకు మద్దతుగా నిలవడం విశేషం. కెనడా పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న తొలి మైనార్టీ నేతగా జగ్మీత్ గుర్తింపు పొందారు. ఆయన న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేతగా వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతకు ప్రధాని మద్దతు
Justine Trudeau supports Jagmeet Singh


ఫెడరల్ పోలీస్ ఫోర్స్‌లో జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్‌డీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై సంతకం చేయడానికి నిరాకరించిన వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ సభ్యుడితో బుధవారం ఆయన జగ్మీత్ గొడవపడ్డారు. ‘దేశంలోని ప్రతి భాగంలో, అన్ని సంస్థలలో వివక్షత, జాత్యహంకారం ఉందని బ్లాక్ క్యూబెకోయిస్ నిరాకరించడం తనను నిరాశపరిచింది’ అని కెనడా ప్రధాని వ్యాఖ్యానించారు. తొలుత వ్యవస్థలో ఉన్న జాత్యహంకారాన్ని గుర్తించి, పరిష్కరించడం ముఖ్యమని అన్నారు.

‘మేము ఒక దేశంగా ముందుకు సాగాలంటే చర్చలు సాగాలని ఆయన అన్నారు. మైనారిటీలపై జాత్యహంకారం వ్యక్తీకరణను విమర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన అన్నారు. జాత్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ ప్రవేశపెట్టిన తీర్మానంపై బ్లాక్ క్యూబెకోయిస్ సభ్యుడు అలైన్ థెర్రియన్ సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఒకింత అసహానానికి గురయిన జగ్మీత్ సింగ్.. థెర్రియన్‌ది జాత్యహంకారమని ఆరోపించారు.

దీనిపై దుమారం రేగడంతో సింగ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించగా.. తాత్కాలికంగా ఆయనను సభ నుంచి బహిష్కరించారు. థెర్రియన్ చర్యలను ఆ పార్టీ అధినేత వైవ్స్ ఫ్రాంకోయిస్ సమర్థించారు. అంతేకాదు, సింగ్‌పై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కెనడా పార్లమెంట్‌లో ఎన్డీపీ నాలుగో అతిపెద్ద పార్టీ. మొత్తం 338 స్థానాలున్న కెనడా పార్లమెంట్‌లో ఆ పార్టీకి 24 మంది సభ్యులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.