యాప్నగరం

భారత్, చైనా వివాదంపై అమెరికా సూచనలు

సరిహద్దుల్లో భారత్ చైనాల మధ్య నెలకున్న ఉద్రిక్తతలు తగ్గాలంటే సంప్రదింపులు ద్వారా సాధ్యమని, ఇరు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలని అమెరికా సూచింది.

TNN 21 Jul 2017, 3:06 pm
భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు కలిసి చర్చించుకోవాలని అమెరికా సంకేతాలు వెలువరించింది. సరిహద్దులో పరిస్థితులను నేరుగా గమనించి, భారత్, చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి హేథర్ న్యుయర్ట్ అన్నాడు. ఈ విషయాన్ని చెప్పకుండా ఇరుదేశాలకు సూచనప్రాయంగా తెలియజేశారు. ఇరు వర్గాలకు సంప్రదింపులకు ముందుకొస్తే మా వంతు సహకారం అందిస్తామని హేథర్ పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించడానికి దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ల్యూ కాంగ్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా దీనిపై వ్యాఖ్యానించింది.
Samayam Telugu doklam issue us indicates india china are going to talk more
భారత్, చైనా వివాదంపై అమెరికా సూచనలు


దోక్లామ్ నుంచి బలగాలను ఉపసహరించుకోవాలని చైనా పదే పదే భారత్‌ను డిమాండ్ చేస్తోంది.... తమ సైన్యాన్ని వెనక్కుతీసుకోమంటున్న చైనా మరి వారి బలగాలను ఎందుకు పెద్ద సంఖ్యలో మెహరిస్తోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. అంతేకాదు ఆ ప్రాంతం నుంచి మీ సైన్యాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ వివాదంపై చర్చించడానికి ముందు డోక్లామ్ త్రి కూడలి నుంచి భూటాన్‌తో సహా అన్ని దేశాలను బలగాలను ఉపసంహరించాలని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుష్మా వెల్లడించారు. డోక్లామ్ మీదుగా చైనా రోడ్డు నిర్మాణం వల్ల భద్రతాపరంగా భారత్ ముప్పు ఎదుర్కొంటుందని, మూడు దేశాల కూడలిని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరించి డోక్లామ్ త్రి కూడలిని ఆక్రమించుకోవడమే చైనా ప్రధాన ఉద్దేశమని, దీన్ని గమనించే ఇండియా అడ్డు చెప్తుందని, ఇది తమకు భద్రతకు సవాల్ లాంటిదని సుష్మా స్వరాజ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.