యాప్నగరం

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్

గ్రీన్ కార్డులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డుల జారీకి అవకాశం కల్పించేలా ట్రంప్ ప్రకటన చేశారు.

TNN 31 Jan 2018, 10:32 am
గ్రీన్ కార్డులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డుల జారీకి అవకాశం కల్పించేలా ట్రంప్ ప్రకటన చేశారు. ఇలా చేయడం ద్వారానే అమెరికాను తొలి స్థానంలో ఉంచగలమని ఆయన తెలిపారు. ‘ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది. నైపుణ్యం ఉండి, మన సమాజానికి సేవ చేసేవారికి, మన దేశాన్ని ప్రేమించి, గౌరవించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ట్రంప్ ప్రకటించారు. కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu donald trump on green cards time to move to merit based system
భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్


ట్రంప్ తాజా ప్రకటనతో ప్రతిభావంతులైన భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. నైపుణ్యాలున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరినప్పటికీ.. వారి తల్లిదండ్రులు, అత్తమామల్ని మాత్రం తీసుకెళ్లడం ఇక మీదట కుదరదు. చైన్‌ మైగ్రేషన్‌ విధానం ఉండబోదని ట్రంప్ తెలిపారు. గతంలో కాన్సాస్‌లో కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్‌ భార్య సునయన కూడా ట్రంప్ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.