యాప్నగరం

మీడియా విందుకు రానని చెప్పిన ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక కూడా ఏమాత్రం మారలేదు.

TNN 27 Feb 2017, 9:32 am
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక కూడా ఏమాత్రం మారలేదు. మీడియాతో నిత్యం గొడవలు పడుతూనే ఉన్నాడు. శ్వేతసౌధంలో పనిచేసే మీడియా ప్రతినిధులకు ఓ సంఘం ఉంది. ఆ సంఘం తరుపున ఏటా అధ్యక్షుడికి విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అధ్యక్షుడితో పాటూ అనేక మంది ప్రముఖులు కూడా హాజరవుతారు. కాగా ట్రంప్ మాత్రం నేను హాజరవ్వనని చెప్పేశాడు. అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాక ఇది అతని మొదటి మీడియా ప్రతినిధులు విందు. అయితే ట్విట్టర్లో ఆయన ఈ ఏడాది మీడియా ప్రతినిధుల డిన్నర్ కు నేను హాజరవ్వడం లేదు. అంతా మంచే జరగాలని కోరుకోండి. మీకు అది మధురమై సాయంత్రం కావాలని కోరుకుంటున్న అని ట్వీటులో ఆయన పేర్కొన్నారు. ఈ విందును ముఖ్యంగా నిర్వహించేది జర్నలిజం స్కాలర్ షిప్‌లకు నిధులను సేకరించేందుకు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వాళ్లందరూ విందుకు హాజరయ్యేందుకు ప్రాధాన్యత నిస్తారు. అయితే ట్రంప్ రానని అనడం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
Samayam Telugu donald trump says he wont attend white house correspondents dinner
మీడియా విందుకు రానని చెప్పిన ట్రంప్

I will not be attending the White House Correspondents' Association Dinner this year. Please wish everyone well and have a great evening! — Donald J. Trump (@realDonaldTrump) February 25, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.