యాప్నగరం

ట్రంప్‌కు కరోనా నెగటివ్.. యూఎస్‌లో పెరిగిన పొలిటకల్ హీట్

US Elections: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా నెగటివ్‌గా తేలింది. తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో అమెరికాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Samayam Telugu 13 Oct 2020, 3:34 pm
ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌కు గొప్ప ఊరట కలిగింది. ఆయనకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ట్రంప్ తిరిగి ఎన్నికల ప్రచారంలో అడుగు పెట్టడంతో అమెరికాలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్ వైద్యుడు డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. వరుస రోజుల్లో జరిపిన నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 12) అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu డొనాల్డ్ ట్రంప్
Donald Trump Covid-19 negative


ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలో ప్రచార పర్వంలో పాల్గొంటారని వైట్‌హౌస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు కరోనా నెగటివ్‌గా వచ్చినట్లు ప్రకటన వెలువడింది.

ట్రంప్ తాను కరోనా వైరస్ బారినపడినట్లు అక్టోబర్‌ 2న వెల్లడించారు. ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ కూడా వైరస్ బారిన పడ్డారు. వాల్టర్‌ రీడ్‌ సైనిక హాస్పిటల్‌లో మూడు రోజుల చికిత్స అనంతరం వారిద్దరూ శ్వేతసౌధం చేరుకున్నారు. అనంతరం అక్కడే చికిత్స కొనసాగించారు. ట్రంప్‌లో క్రియాశీలక (Active) వైరస్‌ లేదని.. ఆయన నుంచి ఎవరికీ వైరస్‌ సోకే ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

Also Read: బీజీపీలో చేరిన కుష్బూ.. తమిళనాడు ముఖచిత్రం మారుస్తారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.