యాప్నగరం

మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం!

అమెరికాకు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్వేత సౌధానికి వెళుతున్నారు.

TNN 9 Jun 2017, 7:55 pm
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. జూన్‌ నెలాఖరులో వైట్‌ హౌస్‌లో ఇరు దేశాధినేతలు కలుసుకోనున్నారు. ‘భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం.. జూన్‌ నెలాఖరుకు ఆయన వాషింగ్టన్‌ వచ్చే అవకాశం ఉంది’ అని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి హేథర్‌ న్యూర్ట్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లనున్న మోదీ పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కూడా చేసుకోనున్నారు.
Samayam Telugu donald trump to host pm modi at white house
మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం!


అమెరికాకు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్వేత సౌధానికి వెళుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ 3 సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ 8 సార్లు అధ్యక్షుడు ఒబామాతో సమావేశమయ్యారు. మోదీ 3 పర్యాయాలు వాషింగ్టన్‌ వెళ్లారు. 2015 గణతంత్ర దినోత్సవ వేడుకులకు ప్రత్యేక అతిథిగా ఒబామా భారత్‌‌కు విచ్చేసిన విషయం విదితమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.