యాప్నగరం

టెర్రరిజంపై డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏంటి ?

వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ ముందు అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇదే వేదికపై నుంచి

TNN 21 Jan 2017, 6:08 am
అమెరికా కాలమానం ప్రకారం అక్కడ శుక్రవారం ఉదయం (భారత్‌లో శుక్రవారం రాత్రి) వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ ముందు అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇదే వేదికపై నుంచి ఇస్లాం తీవ్రవాదంపై తన వైఖరిని ప్రకటించారు. అమెరికాలోకి అక్రమవలసదారుల్ని అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని చెబుతూ.. 'నాగరిక సమాజాన్ని అంతా ఏకం చేసి ఇస్లామిక్ తీవ్రవాదంపై పోరాడేదుకు కృషి చేస్తాం' అని స్పష్టంచేశారు. 'ప్రపంచపటంలో ఎక్కడా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది లేకుండా ఏరిపారేసేందుకు అందరం ఏకమై ముందడుగేయాల్సిన అవసరం ఉంది' అని అన్నారు ట్రంప్.
Samayam Telugu donald trumps take on islamic terrorsim in us and world
టెర్రరిజంపై డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏంటి ?


అమెరికా పట్ల అక్కడి పౌరులు వ్యవహరించాల్సిన తీరు గురించి చెబుతూ.. "అమెరికా భూభాగంపై జరిగే రాజకీయాలన్నీ అమెరికాకు విధేయత కలిగి వుండేవే అయ్యుండాలి. మనం మన దేశం పట్ల విధేయత చూపించినప్పుడే ఒకరిపట్ల ఒకరు విధేయత కలిగివుంటారు" అని అభిప్రాయపడ్డారు ట్రంప్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.