యాప్నగరం

ఈఫిల్ టవర్‌కు బాంబ్ బెదిరింపు.. చుట్టుముట్టిన భద్రతా దళాలు

Paris: పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టారు.

Samayam Telugu 23 Sep 2020, 9:52 pm
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఈఫిల్ టవర్‌ను బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. సందర్శకులను అక్కడ నుంచి పంపించి తనిఖీలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.
Samayam Telugu పారిస్
Eiffel Tower


తనిఖీల అనంతరం ఈఫిల్ టవర్‌ను సందర్శకుల కోసం తిరిగి ఓపెన్ చేశారు. అక్కడ ఎలాంటి బాంబ్ లేదని పోలీసుల అధికారులు తేల్చారు. ఫ్రాన్స్‌లో కరోనా కారణంగా ఈఫిల్ టవర్‌ సందర్శనను నిలిపివేశారు. సుమారు 104 రోజుల తర్వాత టవర్ సందర్శనకు తిరిగి అనుమతి ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఫేక్ కాల్ చేసిన దుండగుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read: టైమ్స్ జాబితాలో షహీన్ బాగ్ దాదీ.. నిరసనతో ప్రపంచం దృష్టికి 82 ఏళ్ల మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.