యాప్నగరం

US: అమెరికాలో భారతీయ కుటుంబం కిడ్నాప్... 8 నెలల పసికందు కూడా..

అమెరికాలో (US) కిడ్నాప్ కలకలం రేగింది. భారత సంతతికి చెందిన నలుగురు అపహరణకు గురయ్యారు. బాధితుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలను చూపించి.. వారికి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు కిడ్నాపర్ల నుంచి ఎటువంటి హెచ్చరికలు, ప్రతిపాదలను రాలేదని అధికారులు వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుకేసుకుంది. అయితే అప్పుడు కిడ్నాప్ చేసిన వ్యక్తి ప్రాణాలు తీశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 Oct 2022, 1:46 pm

ప్రధానాంశాలు:

  • కాలిఫోర్నియాలో కలకలం
  • నలుగురు భారతీయుల అపహరణ
  • దర్యాప్తు చేస్తోన్న స్థానిక అధికారులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Indians Kidnapped In US
అమెరికాలో (US) భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో ఓ కుటుంబాన్ని సోమవారం దుండగులు వీరిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. కిడ్నాప్‌కు గురైన వ్యక్తులు ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి కూడా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయుదాలతో బెదిరించి వీరిని కిడ్నాప్ చేసినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెల్లడించారు. వారు ప్రమాదకరమైన వారుగా ఉన్నారని అక్కడి పోలీసులు తెలిపారు.
కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (27) వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరిని, మరో అమన్‌దీప్ సింగ్‌ను (39) కిడ్నాపర్లు తీసుకెళ్లినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, దీనిపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. రెస్టారెంట్లు, వ్యాపారాలు సాగే ప్రాంతం నుంచి వీరిని కిడ్నాప్ చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు కిడ్నాపర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలు, హెచ్చరికలు రాలేదని, అనుమానిత వ్యక్తుల గురించి తెలిస్తే.. 911కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచించారు.

కాగా 2019లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పట్లో అమెరికాలో ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యాజమానిని కాలిఫోర్నియాలోని ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి పట్టుకెళ్లారు. అలా పట్టుకెళ్లిన వ్యక్తి విగతజీవిగానే కనిపించాడు. కిడ్నాప్ చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే అతని మృతదేహం ఒక కారులో లభ్యమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.