యాప్నగరం

వరల్డ్ వార్-2 నాటి బాంబును నిర్వీర్యం చేసిన జర్మనీ!

జర్మనీ ఆర్థిక రాజధాని నగరం ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లో ఓ నిర్మాణం కోసం తవ్విన ప్ర‌దేశంలో రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం నాటి బాంబును కనుగొన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 4 Sep 2017, 3:25 pm
జర్మనీ ఆర్థిక రాజధాని నగరం ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లో ఓ నిర్మాణం కోసం తవ్విన ప్ర‌దేశంలో రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం నాటి బాంబును కనుగొన్న విషయం తెలిసిందే. దీనిని నిపుణులు ఆదివారం విజయవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ బాంబును నిర్వీర్యం చేయ‌డం కోసం చుట్టుప‌క్క‌ల ఒకటిన్నర కిలోమీట‌ర్ల ప‌రిధిలో నివ‌సించే 60,000 మందిని ఖాళీ చేయించారు. బాంబు ప్ర‌భావంగా అధికంగా ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేయ‌డంతో 60వేల మందిని ఖాళీ చేయించ‌డానికి ఫ్రాంక్‌ఫ‌ర్ట్ సిద్ధ‌ప‌డింది. ఖాళీ చేయించిన ప్ర‌దేశంలో రెండు ఆసుప‌త్రులు, బ్యాంకుల‌తో పాటు ఇత‌ర సామాజిక స‌ముదాయాలు కూడా ఉన్నాయి. యుద్ధ స‌మ‌యంలో మిన‌హా ఇలాంటి చ‌ర్య తీసుకోవ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌రు.
Samayam Telugu explosives experts defuse second world war bomb in frankfurt
వరల్డ్ వార్-2 నాటి బాంబును నిర్వీర్యం చేసిన జర్మనీ!


సాహ‌సం చేసి, బాంబును విజ‌య‌వంతంగా నిర్వీర్యం చేయ‌డంతో అక్క‌డి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. గతవారం లీఫీ వెస్టెండ్ సబర్బ్ ప్రాంతంలో బాంబును కనుగొన్నారు. ఈ ప్రాంతంలోనే జర్మనీ కేంద్ర బ్యాంకు కూడా ఉంది. అందులో 70 బిలియన్ డాలర్ల విలువైన బంగారు నిల్వలు కూడా ఉన్నాయి. జర్మనీలో ఏటా 2 వేల టన్నుల బరువుండే బాంబులను కనుగొంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, అమెరికాలు జర్మనీపై 1.5 మిలియన్ టన్నుల బాంబులను జారవిడిచి 6 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం శత్రు దేశాలు జర్మనీపై వేసిన 15 శాతం బాంబులు పేలకుండా భూమిలో ఉండిపోయాయి. కొన్ని ఆరు మీటర్ల లోతుకు చొచ్చుకుపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.