యాప్నగరం

డ్రగ్స్ మత్తులో డ్రైవ్ చేస్తూ పట్టుబడిన మోడల్

ప్రముఖ స్విమ్ సూట్ మోడల్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ లారిన్ ఈగల్ డ్రగ్స్ మత్తులో...

TNN 14 Jul 2017, 8:53 pm
ప్రముఖ స్విమ్ సూట్ మోడల్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ లారిన్ ఈగల్ డ్రగ్స్ మత్తులో కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకి పట్టుబడింది. రోడ్డుపై వాహానాలని తనిఖీ చేస్తున్న పోలీసులు అదే సమయంలో అటుగా వచ్చిన ఆడి క్యూ5 కారుని కూడా ఆపి తనిఖీలు చేశారు. ఆ సమయంలో కారుని డ్రైవ్ చేస్తున్న లారిన్ డ్రగ్స్ మత్తులో వున్నట్టు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో ఆమె మెతాఫెటామైన్ అనే డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందంటున్నారు ఆస్ట్రేలియాలోని కొగర పోలీసులు.
Samayam Telugu famous swimsuit model caught driving under the influence of drugs
డ్రగ్స్ మత్తులో డ్రైవ్ చేస్తూ పట్టుబడిన మోడల్


వెంటనే లారిన్‌ని స్టేషన్‌కి తరలించిన పోలీసులు ఆమెని మరో 24 గంటలపాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఇదిలావుంటే, లారిన్ తరపు న్యాయవాది ఆడమ్ హౌడ మాత్రం అదంతా ఉత్తి ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న లారిన్ గత కొంతకాలంగా అందుకు చికిత్స తీసుకుంటోందని, బహుశా ఆ మెడికేషన్ కారణంగానే ఆమె బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ పాజిటివ్ చూపించి వుండవచ్చని సెలవిచ్చారు ఆడమ్.

ఏదేమైనా పోలీసుల వాదన నిజమైతే, మొదటిసారి చేసిన నేరం కింద ఆమెకి కనీసం 3 నెలల జైలు శిక్ష, 3,300 డాలర్ల జరిమానా తప్పదు అంటున్నారు న్యాయ నిపుణులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.