యాప్నగరం

బోట్లు ఢీకొని 30 మంది మృతి.. ఢాకాలో ఘోర ప్రమాదం

Dhaka: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల బోటు నీట మునిగిన ఘటనలో 30 మంది మరణించారు. మరో 20 మంది గల్లంతయ్యారు. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 29 Jun 2020, 4:55 pm
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బోట్లు పరస్పరం ఢీకొనడంతో ప్రయాణికులతో ఉన్న ఓ బోటు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. 20 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 23 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఫైర్ బ్రిగేడ్ అధికారి ఇనాయత్ హుస్సేన్ మీడియాకు తెలిపారు.
Samayam Telugu బంగ్లాదేశ్ ప్రమాదం
Vessel Capsize in Dhaka


బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో సోమవారం (జూన్ 29) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఎంవీ మార్నింగ్ బర్డ్ అనే ప్రయాణికుల బోటు ఎంవీ మొయూర్ అనే నౌకను ఢీకొట్టినట్లు బంగ్లాదేశ్ అధికారులు పేర్కొన్నారు. ఢాకా-ఛాంద్‌పూర్ జలమార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: ఘోరం! బహిర్భూమికి వెళ్లి గ‌ర్భిణి ప్రసవం.. శిశువును లాక్కెళ్లిన అడవి జంతువు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.