యాప్నగరం

భారత నేవీ అధికారికి ఉరిశిక్ష విధించిన పాక్!

భారత మాజీ నేవీ అధికారి ఒకరికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ

TNN 10 Apr 2017, 4:30 pm
భారత మాజీ నేవీ అధికారి ఒకరికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. కుల్భూషణ్ జాదవ్ (కుల భూషణ్)అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్ మీదుగా బలూచిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
Samayam Telugu former indian naval officer kulbhushan yadav sentenced to hang in pak
భారత నేవీ అధికారికి ఉరిశిక్ష విధించిన పాక్!


కుల్భూషణ్ ను అప్పగించాలని భారత ప్రభుత్వం కోరినప్పటికీ పాక్ సర్కార్ అందుకు అంగీకరించలేదు.

కుల్బూషణ్ పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలపాలు కొనసాగిస్తున్నాడని ఆ దేశ విదేశీ వ్యవహార సలహాదారు సర్తాజ్ అజీజ్ గతంలో ఆరోపించారు. బలూచిస్థాన్ లో హింసను ప్రేరేపించేలా భారత్ ప్రొత్సహిస్తోందని యాదవ్ చెప్పినట్లు గతేడాది మార్చిలో పాకిస్థాన్ వెల్లడించింది.

Indian R&AW agent #Kalbushan awarded death sentence through FGCM by Pakistan Army for espionage and sabotage activities against Pakistan. pic.twitter.com/ltRPbfO30V — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2017
పాకిస్థాన్ కుల్భూషణ్ జాదవ్ పై చేసిన ఆరోపణలు భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.
యాదవ్ కు విధించిన ఉరిశిక్షపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.