యాప్నగరం

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ ఇకలేరు..

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 18) తుదిశ్వాస విడిచారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రస్థానం వివిధ స్థాయుల నుంచి సెక్రటరీ జనరల్‌ స్ధాయి వరకూ సాగింది.

Samayam Telugu 18 Aug 2018, 4:56 pm
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 18) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కోఫి అన్నన్ ఫౌండేషన్ ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రస్థానం వివిధ స్థాయుల నుంచి సెక్రటరీ జనరల్‌ స్ధాయి వరకూ సాగింది. సెక్రటరీ జనరల్‌‌గా 1997 నుంచి 2006 వరకు కోఫి అన్నన్ విధులు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2001లో నోబెల్ శాంతి బహుమతి ఆయనను వరించింది.
Samayam Telugu annan1


1938, ఏప్రిల్ 8న ఘనాలోని కుమాసి గ్రామంలో కోఫి అన్నన్ జన్మించారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. ఐక్య రాజ్య సమితి 7వ ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్)గా ఎంపికయ్యారు. ఆఫ్రికా ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. కోఫి అన్నన్ అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. అన్నన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చివరిరోజుల్లో వారు ఆయన వెన్నంటే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.