యాప్నగరం

జర్మన్ ఛాన్సలర్‌గా మరోసారి మెర్కెల్

6 నెల‌ల క్రితం జ‌ర్మ‌నీ చ‌ట్ట‌స‌భ పార్ల‌మెంటుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెర్కెల్ క్రిస్టియ‌న్ డెమొక్ర‌టిక్ యూనియ‌న్, సోష‌ల్ డెమొక్ర‌టిక్ పార్టీలు పోటీ చేశాయి. మొత్తం 700 మంది ఉన్న పార్ల‌మెంటులో 50%ఓట్లు వ‌చ్చిన వాళ్లే చాన్స‌ల‌ర్ ప‌దవి చేప‌ట్టేందుకు అర్హ‌త సాధిస్తారు. అయితే దాని త‌ర్వాత దాదాపు 6 నెల‌ల వ‌ర‌కూ చాన్స‌ల‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌లేదు.

TNN 15 Mar 2018, 10:57 am
జర్మనీ దేశం మరోసారి ఏంజెలా మెర్కెల్ సారథ్యంలో నడవబోతోంది. ఆమె నాలుగోసారి ఆ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. 6 నెల‌ల క్రితం జ‌ర్మ‌నీ చ‌ట్ట‌స‌భ పార్ల‌మెంటుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెర్కెల్ క్రిస్టియ‌న్ డెమొక్ర‌టిక్ యూనియ‌న్, సోష‌ల్ డెమొక్ర‌టిక్ పార్టీలు పోటీ చేశాయి. మొత్తం 700 మంది ఉన్న పార్ల‌మెంటులో 50%ఓట్లు వ‌చ్చిన వాళ్లే చాన్స‌ల‌ర్ ప‌దవి చేప‌ట్టేందుకు అర్హ‌త సాధిస్తారు. అయితే దాని త‌ర్వాత దాదాపు 6 నెల‌ల వ‌ర‌కూ చాన్స‌ల‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌లేదు. 171 రోజుల త‌ర్వాత పార్లమెంటులోని దిగువ సభలో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 364 ఓట్లు, వ్యతిరేకంగా 315 ఓట్లు లభించాయి. తొమ్మిది మంది సభ్యులు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.
Samayam Telugu german chancellor angela merkel takes her oath to serve her fourth term as chancellor
జర్మన్ ఛాన్సలర్‌గా మరోసారి మెర్కెల్



63 ఏళ్ళ ఏంజెలా మెర్కెల్ జర్మన్ ఛాన్సలర్‌గా నాలుగోసారి ఎన్నికయ్యారు. బహుశా ఇదే చివరి పదవీ కాలం కావచ్చు. ఆమె నాయకత్వం వహిస్తున్న పార్టీల కూటమిలో లుకలుకలు ఉండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.