యాప్నగరం

ఉగ్రదాడి: పర్యాటకులపైకి వ్యాన్.. పలువురి మృతి

జర్మనీలో పర్యాటకులపైకి ఓ ఉగ్రవాది వ్యాన్‌ ఎక్కించిన ఘటనలో పలువురు మృత్యువాత పడగా.. అనేక మంది గాయపడ్డారు. బెర్లిన్‌కు 300 కి.మీ. దూరంలోని మున్‌స్టర్ నగరంలో శనివారం (ఏప్రిల్ 7) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు.

TNN 7 Apr 2018, 10:01 pm
ఉగ్రభూతం మరోసారి జడలు విప్పింది. జర్మనీలో పర్యాటకులపైకి ఓ ముష్కరుడు వ్యాన్‌ ఎక్కించిన ఘటనలో పలువురు మృత్యువాత పడగా.. అనేక మంది గాయపడ్డారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 300 కి.మీ. దూరంలోని మున్‌స్టర్ నగరంలో శనివారం (ఏప్రిల్ 7) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు.
Samayam Telugu Munster terror attack


మున్‌స్టర్ నగరంలోని ప్రసిద్ధ కైపెన్‌కెర్ల్ విగ్రహం వద్ద కూర్చొని ఉన్న 30 మందికి పైగా పర్యాటకులపైకి ఓ ఆగంతుకుడు ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. మినీ ట్రక్కుతో వేగంగా దూసుకొచ్చాడు. ఆహ్లాదంగా గడుపుతున్న టూరిస్టులపైకి వ్యాన్ దూసుకురావడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. ఘటన అనంతరం ముష్కరుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద వార్త అందగానే భద్రతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు.

పరిస్థితి విషమంగా ఉన్నవారిని ప్రత్యేక హెలికాప్టర్‌లలో బెర్లిన్ తరలిస్తున్నారు. ఘటన పట్ల జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ నేతలు కూడా ఉగ్రవాద చర్యను ఖండించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.