యాప్నగరం

పోర్చుగల్ అడవిలో కార్చిచ్చు.. 62 మంది దుర్మరణం!

పోర్చుగల్‌లోని ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు 62 మందిని బలిగొంది. ఈ ప్రమాదంలో మరో 40 మంది వరకు..

TNN 18 Jun 2017, 8:56 pm
పోర్చుగల్‌లోని ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు 62 మందిని బలిగొంది. ఈ ప్రమాదంలో మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దావానంలా వ్యాపించిన మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు అంటుకున్నాయి. మృతుల్లో ఎక్కువగా కార్లలో కూర్చున్నవాళ్లే ఉన్నారు. కూర్చున్నవారు కూర్చున్నట్లే అగ్నికి ఆహుతయ్యారు. మంటలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 300 అగ్నిమాపక యంత్రాలతో 900 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Samayam Telugu huge forest fires kill 62 in portugal
పోర్చుగల్ అడవిలో కార్చిచ్చు.. 62 మంది దుర్మరణం!


గత కొన్నేళ్లలో ఇంతటి పెను ప్రమాదాన్ని చూడలేదని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంటల కారణంగా ఏర్పడిన దట్టమైన పొగ చుట్టు పక్కల 20 కిలోమీటర్ల వరకూ వ్యాపించింది.

అడవి చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామస్థులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోర్చుగల్‌ అధ్యక్షుడు మార్సెలో రిబిలో బాధితుల కుటుంబాలను కలుసుకోనున్నారు. పోర్చుగల్ అరణ్య ప్రాంతాల్లో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు తలెత్తుతున్నాయి. గత ఏడాది కార్చిచ్చు కారణంగా దాదాపు లక్ష ఎకరాల్లోని అడవి కాలి బూడిదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.