యాప్నగరం

900 మందిని బలిగొన్న ‘మాథ్యూ’

హరికేన్ మాథ్యూ బీభత్సం సృష్టించింది. ఈ బీకర తుపాను హైతీలో సుమారు 900 మందిని పొట్టనబెట్టుకుంది.

TNN 8 Oct 2016, 4:49 pm
హరికేన్ మాథ్యూ బీభత్సం సృష్టించింది. ఈ బీకర తుపాను హైతీలో సుమారు 900 మందిని పొట్టనబెట్టుకుంది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరాన్ని తాకడానికి కొన్ని గంటల ముందు ‘మాథ్యూ’ హైతీని తుడిచిపెట్టేసింది. ఈ ప్రకృతి విళయం కారణంగా హైతీలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా ఖండంలో పేద దేశమైన హైతీని కోలుకోలేని దెబ్బతీసింది. దీని ప్రభావం యూఎస్‌పై కూడా ఉండటంతో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Samayam Telugu hurricane matthew kills almost 900 in haiti before hitting us
900 మందిని బలిగొన్న ‘మాథ్యూ’

హరికేన్ మాథ్యూ ముఖ్యంగా హైతీ పశ్చిమ ప్రాంతంపై విరుచుకుపడింది. గంటకు 233 కి.మీ. వేగంతో వీచిన ఈదురు గాలులు తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. 61,500 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని హైతీ అధికారులు వెల్లడించారు. మాథ్యూ ధాటికి ఫ్లోరిడాలో కూడా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడా తీర ప్రాంతంలో గంటకు 195 కి.మీ. వేగంతో మాథ్యూ విరుచుకుపడుతోంది. యూఎస్ గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఆందోళన చెందొందని యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.