యాప్నగరం

సేనల ఉపసంహరణకు చైనా అంగీకారం

సరిహద్దుల్లో చైనాతో గత మూడు మాసాలుగా కొనసాగుతోన్న డోక్లామ్ వివాదానికి త్వరలోనే తెరపడుతోందని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

TNN 28 Aug 2017, 1:28 pm
సరిహద్దుల్లో చైనాతో గత మూడు మాసాలుగా కొనసాగుతోన్న డోక్లామ్ వివాదానికి త్వరలోనే తెరపడుతోందని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాంతం నుంచి తమ సేనలను ఉపసంహరించుకోడానికి చైనా అంగీకరించిందని, దీనికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా వెలువడ్డాయని తెలిపింది. డోక్లామ్ వివాదంపై గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను, ఆందోళనలను వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. సరిగ్గా ప్రధాని చైనా పర్యటనకు ముందు ఈ ప్రకటన వెలువడం గమనార్హం. ఎందుకంటే సెప్టెంబరు 3 నుంచి 5 వరకు చైనా వేదికగా జరిగే బ్రిక్స్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
Samayam Telugu india says sikkim standoff with china resolved troops disengaging
సేనల ఉపసంహరణకు చైనా అంగీకారం


గత జూన్ నుంచి భారత్, చైనాలు డోక్లామ్ ప్రాంతంపై పట్టు సాధించడానికి తమ సైన్యాలను మెహరించాయి. భూటాన్ భూభాగంలో అక్రమంగా రోడ్డు నిర్మాణానికి చైనా ప్రయత్నించడంతో భారత్ అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భూటాన్ కోరిక మేరకు భారత్ తన సైన్యాన్ని మెహరించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే చైనా మాత్రం డోక్లామ్‌ను తన భూభాగంగా పేర్కొంటోంది. దీనికి భిన్నంగా చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం ఓ సంపాదీకయం ప్రచురించింది. ప్రధానంగా డేరాల హింసను ప్రస్తావిస్తూ భారత్ అంతర్గత సమస్యలతో సతమతమవుతోందని, అందుకే డోక్లామ్ నుంంచి తన సేనలను ఉపసహరించుకుంటుందని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.