యాప్నగరం

Coronavirus Effect: అన్‌లాక్ చేస్తే.. అనర్థం తప్పదు: డబ్ల్యూహెచ్‌వో చీఫ్

కరోనా ఆంక్షలను త్వరపడి ఎత్తివేస్తే.. ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూ‌హెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. కరోనా అంతమైందని ఏ దేశం నమ్మించలేదన్నారు.

Samayam Telugu 1 Sep 2020, 1:54 pm
ఓ వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. భారత్ అన్‌లాక్ ప్రక్రియను చేపట్టింది. మోదీ సర్కారు ఇటీవలే అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించింది. మెట్రో రైళ్ల పునరుద్ధరణ సహా పలు సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. మిగతా ప్రపంచ దేశాలు కూడా అన్‌లాక్ ప్రక్రియను చేపడుతున్నాయి. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అద్నమ్ ఘేబ్రెయేసిస్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. కరోనా ముప్పు కొనసాగుతున్న వేళ.. తొందరపడి అన్‌లాక్ ప్రక్రియను చేపడితే.. ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Samayam Telugu Who chief


జాగ్రత్తలు తీసుకోకుండా అన్‌లాక్ చేపడితే ఇబ్బందులు తప్పవని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కరోనా మహహ్మారి అంతమైందని ఏ దేశమూ భావించొద్దన్నారు. కార్యక్రమాలను విచ్చలవిడిగా నిర్వహించొద్దని.. ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమను తాము కాపాడుకోవాలని.. కరోనా కేసులను గుర్తించి చికిత్స అందించాలని, కరోనా బాధితుల కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్లో ఉంచాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సూచించారు.

అన్‌లాక్ ప్రక్రియ చేపట్టే విషయంలో దేశాలు సీరియస్‌గా ఉంటే.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, ప్రాణాలను కాపాడటంలోనూ అదే రీతిలో వ్యవహరించాలని టెడ్రోస్ సూచించారు. ప్రపంచ దేశాల సామాజిక, ఆర్థిక వ్యవస్థలు తిరిగి సాధారణ స్థితికి చేరే ప్రక్రియ సురక్షితంగా ఉండాలని ఓ సమావేశం సందర్భంగా టెడ్రోస్ వెల్లడించారు. కరోనా సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.

కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత జర్మనీలో కరోనా కేసులు పెరిగాయి. కోవిడ్‌ అదుపులోకి వచ్చిందనుకున్న దక్షిణ కొరియాలోనూ ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.