యాప్నగరం

డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయులు, భారత సంతతి ఓట్లు కీలకం కావడంతో అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లు వారిని ప్రసన్నం చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Samayam Telugu 12 Aug 2020, 12:07 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ పోటీ పడుతున్నారు. తాజాగా, భారత సంతతి మహిళ, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్‌ను డెమొక్రాట్ల తరఫున వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ పేరును ఖరారు చేసింది. కమలా హ్యారిస్ పేరును అధికారికంగా ప్రకటించిన జో బిడెన్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడటం ఇదే తొలిసారి. అంతేకాదు, ఓ పెద్ద పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న నాలుగో మహిళ కావడం మరో విశేషం.
Samayam Telugu కమలా హ్యారిస్
Kamala Harrish


Read Also: కశ్మీర్‌లో ఎదురుకాల్పులు: అమరుడైన జవాన్.. ఓ ఉగ్రవాది హతం

అలాగే, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తొలి నల్లజాతీయురాలిగానూ కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎంపికైన కమలా యూఎస్ సెనెట్‌కు ఎంపికైన తొలి భారతీయ అమెరికన్‌గా... రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా ఖ్యాతి పొందారు. ఒకవేళ, బిడెన్ విజయం సాధించి, ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎన్నిక కాగలిగితే.. 2024 అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సర్వసాధారణంగా నామినేట్ అవుతారు.

Read Also: రష్యా వ్యాక్సిన్ కోసం క్యూ కడుతోన్న ఆర్డర్లు.. 20 దేశాల నుంచి బిలియన్‌ దరఖాస్తులు!

తమిళ మూలాలున్న కమలా హ్యారిస్.. తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. తర్వాత జమైకాకు చెందిన హ్యారిస్‌ను వివాహం చేసుకున్నారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం న్యాయవాద వృత్తిని చేపట్టి.. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే సెనేట్‌కు ఎంపికయిన ఆమె.. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

Read Also: రష్యా వ్యాక్సిన్ భద్రత‌పై అనుమానాలు.. డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు

తనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారుచేయడంపై కమలా హ్యారిస్ హర్షం వ్యక్తం చేస్తూ జో బిడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘జోబిడెన్ అమెరికన్ ప్రజలను ఏకం చేయగలడు ఎందుకంటే ఆయన మన కోసం పోరాడుతూ తన జీవితాన్ని గడిపారు. అధ్యక్షుడిగా ఆయన మన ఆదర్శాలకు అనుగుణంగా ఉండే అమెరికాను నిర్మిస్తారు. తనను ఉపాధ్యక్ష పదవికి మా పార్టీ నామినీగా చేరడం గౌరవం.. పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తిచేస్తాం’అని అన్నారు.

Read Also: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్.. ఆమెను కించపరుస్తూ ట్రంప్ వ్యాఖ్యలు

‘నిర్భయమైన పోరాట యోధురాలు, దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ సేవకులలో ఒకరిని నా సహచరుడిగా ఎంపిక చేసినట్టు ప్రకటించినందుకు నాకు గొప్ప గౌరవంగా ఉంది’ అని బిడెన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.