యాప్నగరం

ట్రంప్ కేబినెట్లో కీలక పోస్టుపై కన్నేసిన నిక్కీ హేలీ

ట్రంప్ కేబినెట్లో కీలక పోస్టులపై భారతీయ అమెరికన్లు కన్నేశారు. నిక్కీ హేలీ, బాబీ జిందాల్‌లు ఈ రేసులో ముందున్నారు.

TNN 17 Nov 2016, 10:04 am
వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో... కీలక మంత్రిత్వ శాఖలపై భారతీయ అమెరికన్లు కన్నేశారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా వ్యవహరించిన నిక్కీ హేలీ.. ట్రంప్ కేబినెట్లో కీలక శాఖను ఆశిస్తోంది. గతంలో హిల్లరీ క్లింటన్ పని చేసిన సెక్రటరీ ఆప్ స్టేట్ పదవిని చేపట్టాలని ఆమె కోరుకుంటోంది. ఈ విషయమై కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌తో గురువారం ఆమె మాట్లాడనుంది. నిక్కీకి ట్రంప్ కేబినెట్లో చోటు దాదాపు ఖాయమైందని ఆయన కీలక సహాయకుడొకరు వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో హేలీ ట్రంప్‌కి బాసటగా నిలిచారు. న్యూయార్క్ నుంచి ట్రంప్‌కి ఓటేస్తానని ఆమె గతంలో చెప్పారు.
Samayam Telugu indian american politician nikki haley expecting secretary of state post
ట్రంప్ కేబినెట్లో కీలక పోస్టుపై కన్నేసిన నిక్కీ హేలీ


సౌత్ కరోలినాకు తొలి మహిళా గవర్నర్‌గా, తొలి ఇండియన్ అమెరికన్ గవర్నర్‌గా హేలీ ఘనత వహించారు. ట్రంప్ కేబినెట్లో హేలీ ఉన్నతమైన పదవిని చేపట్టే అవకాశం ఉందని స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్‌కు ట్రంప్ కేబినెట్లో పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు.

బాబీ జిందాల్‌తో నిక్కీ హేలీ..(ఫైల్ ఫొటో)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.