యాప్నగరం

అమెరికాలో తెలుగు మహిళకు అవమానం

ఒకవైపు ముస్లిందేశాలపై కత్తికట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో నివసించే మిగతా దేశాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Samayam Telugu 29 Jan 2017, 11:29 am
ఒకవైపు ముస్లిందేశాలపై కత్తికట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో నివసించే మిగతా దేశాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన అనుసరిస్తున్న వలస విధానాలు ఎటుదారితీస్తాయోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రవాస తెలుగు మహిళకు ఎదురయిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనం. ఈ ఉదంతాన్ని ‘ద బాల్టిమోర్‌ సన్‌’ పత్రిక వెలుగులోకి తెచ్చింది.
Samayam Telugu indian american woman quizzed by policce
అమెరికాలో తెలుగు మహిళకు అవమానం

47 ఏళ్ల అరవింద పిల్లలమర్రి అనే మహిళ (తెలుగుమహిళ) గత 30 ఏళ్లుగా మేరీలాండ్‌లో ఉంటున్నారు. డిసెంబరు 21న ఆమె బెల్‌ ఏయిర్‌ ప్రాంతంలో మార్నింగ్ వాక్ కు వెళ్లినప్పుడు పోలీసు అధికారి ఆమెను ఆపి ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. నడకకు వచ్చానని సమాధానమిచ్చారు. అయినా ఆగకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ఇంతలో మరో పోలీసు అధికారి వచ్చి మరింత గట్టిగా అడగడం ప్రారంభించారు. నేరపూరిత వ్యవహారంపై విచారణ జరుగుతున్నందున అక్కడ నుంచి వెళ్లడానికి లేదని కూడా గద్దించారు. గుర్తింపుకార్డు ఎందుకు లేదు? ఇక్కడ చట్టవ్యతిరేకంగా ఉంటున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం తన కంప్యూటర్‌లో ఆమె పేరును సరిచూసుకున్న తరువాత విడచిపెట్టారు. ఆమె ఇక్కడ 30 ఏళ్లుగా ఉంటున్నట్టు, బెల్‌ ఎయిర్‌ హైస్కూలులో చదివారు.
ఈ చేదు అనుభవాన్ని ఆమె జనవరి 17న టౌన్‌ కమిషనర్ల బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఒకవైపు భారత్ తో తమకు నిజమైన ఫ్రెండ్ అని చెప్పిన ట్రంప్..ఆయన వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా పిల్లలమర్రి అరవింద, ఆమె భర్త కూచిమంచి రవి..షారూఖ్‌ ఖాన్‌ సినిమా స్వదేశ్‌ కు స్ఫూర్తినిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.