యాప్నగరం

డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా సౌమ్య స్వామినాథన్

హరిత విప్లవ పితామహుడైన డాక్టర్ ఎం. స్వామినాథన్ కుమార్తె సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

TNN 4 Oct 2017, 11:17 am
ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌‌గా ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె సౌమ్య స్వామినాథన్ నియమితురాలయ్యారు. డబ్ల్యూహెచ్‌వోలో ఇది రెండో అత్యున్నత పదవి కావడం విశేషం. ఆమె ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. టీబీ వ్యాధిపై చేసిన పరిశోధనలు సౌమ్య స్వామినాథన్‌కు గుర్తింపు తెచ్చాయి. పెడియాట్రిషియన్‌గా, క్లినికల్ సైంటిస్ట్‌గా ఆమె గుర్తింపు పొందారు. ఘనాకు చెందిన డాక్టర్ అనార్ఫీ అసమోవా బాహ్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.
Samayam Telugu indian doctor soumya swaminathan new who deputy director general
డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా సౌమ్య స్వామినాథన్


భారత హరిత విప్లవ పితామహుడైన డాక్టర్ ఎంఎస్ స్వామినాథ్ ముగ్గురు కుమార్తెల్లో సౌమ్య ఒకరు. ఆమె తల్లి మీనా విద్యావేత్తగా గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాలపాటు క్లినికల్ కేర్, రీసెర్చ్‌లో సౌమ్య అనుభవం గడించారు. 2009-11 మధ్య కాలంలో ఆమె యూనిసెఫ్‌లో కో ఆర్డినేటర్‌గా పని చేశారు. ఉష్ణ మండల వ్యాధులకు సంబంధించి జెనీవాలో పరిశోధన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

డబ్ల్యూహెచ్‌వో ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌తోపాటు పలు అంతర్జాతీయ సలహా మండలిలు, కమిటీల్లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యూలోసిస్ డైరెక్టర్‌గానూ సౌమ్య వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.