యాప్నగరం

ప్రవాస భారతీయునికి ప్రఖ్యాత అవార్డు

భారత సంతతికి చెందిన వ్యక్తికి ఇజ్రాయెల్ దే అత్యుత్తమ పురస్కారం అందింది.

TNN 7 Feb 2017, 7:42 pm
భారత సంతతికి చెందిన వ్యక్తికి ఇజ్రాయెల్ దే అత్యుత్తమ పురస్కారం అందింది. బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్ కపూర్ (62) కు ఇజ్రాయెల్ ప్రభుత్వం జెనెసిస్ అవార్డును అందించింది. ఆ అవార్డు కింద అనిష్ రూ.6.71కోట్లను అందుకున్నారు. సిరియన్ శరణార్ధుల కష్టాలను, కన్నీటి గాధలను తెరపైకి తేవడంలో ఆయన కృషి చేశారు. వారి పట్ల ప్రభుత్వాలు చేపడుతున్న దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. కాగా తనకి వచ్చి భారీ నగదు బహుమతిని సిరియా శరణార్ధుల కోసమే వినియోగిస్తానని ఆయన ప్రకటించారు.
Samayam Telugu indian origin sculptor anish kapoor wins genesis prize
ప్రవాస భారతీయునికి ప్రఖ్యాత అవార్డు


మహారాష్ట్రాలోని ముంబైలో పుట్టిన అనిష్ చదువు కోసం 1973లో లండన్ వెళ్లారు. అక్కడే శిల్పకారునిగా చదువును పూర్తి చేసుకుని స్థిరపడ్డారు. జర్మన్ యువతిని పెళ్లి చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.