యాప్నగరం

ఇండోనేషియా విమానం అదృశ్యం.. ఫ్లైట్‌లో 62 మంది ప్రయాణికులు

Jakarta: 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేషియా విమానం ఒకటి మిస్సింగ్ అయంది. జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే రాడార్‌తోో సంబంధాలు తెగిపోయాయి.

Samayam Telugu 10 Jan 2021, 8:03 am
ఇండోనేషియాలో ఓ విమానం అదృశ్యమవడం కలకలం రేపుతోంది. జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన శ్రీవిజ‌య సంస్థకు చెందిన బోయింగ్-737 విమానం బయల్దేరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో క్రూ సిబ్బందితో పాటు 62 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కాల‌మానం ప్రకారం శనివారం (జనవరి 9) మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల‌కే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Plane missing


విమానం ఆచూకీ కోసం అధికారులు రాడార్ స‌మాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులు, మహిళలు స‌హా 59 మంది ప్రయాణికులు ఉన్నార‌ని ఇండోనేషియా అధికారులు తెలిపారు. విమానం జ‌క‌ర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోన్‌టియాన‌క్‌కు వెళ్తుండగా అదృశ్యమైంది.

అదృశ్యమైన స‌మ‌యంలో ఫ్లైట్ భూమికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంద‌ని వెల్లడించారు. నిర్జన ద్వీపంలో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.