ప్రపంచవ్యాప్తంగా దారుణ మారణహోమాలు సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ, ఇరాక్, సిరియా దేశాల్లో దీని ఆగడాలకు అదుపులేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఆత్మాహుతి దాడులు, కాల్పులు జరుపుతూ అమాయకులను బలిదీసుకోవడమే కాక, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి యువతులను అపహరించుకుపోతున్నారు. ఇలా అపహరించుకుపోయిన యువతులను ఉగ్రవాదులు వారి సెక్స్ అవసరాలకు వాడుకుంటారు. 2014 ఆగష్టులో ఇరాక్ లోని సింజార్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఐఎస్ ఉగ్రవాదులు అక్కడ్నించి దాదాపు 3000 మంది యువతులను ఎత్తుకొచ్చారు. వీరందరినీ ఉగ్రవాదులకు 'సెక్స్ బానిసలు'గా మారుస్తారు. వారితో సెక్సుకు నిరాకరిస్తే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కాల్చి చంపుతారు. అబ్దుల్లా అల్-మల్లా అనే మీడియా యాక్టివిస్ట్ స్థానిక మీడియాకు నివేదించిన వివరాల ప్రకారం గత గురువారం ఈ ఐసిస్ ఉగ్రవాదులు తమ సెక్స్ బానిసలుగా మారటానికి నిరాకరించిన 19 మంది యువతులను ఇనుప బోనులో ఇరాక్ లోని మోసూల్ నగరంలో ఓ కూడలికి తీసుకొచ్చి వందల మంది చూస్తుండగానే ఆ బోనులోనే యువతులను సజీవ దహనం చేశారు. అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు వారిని కాపాడటానికి సాహసించలేదని వెల్లడించారు.
తాజాగా ఈ ఉగ్రవాదులు అందమైన యువతులు, కన్యలు అమ్మకానికి ఉన్నారు అంటూ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లలో ప్రకటనలు చేస్తున్నట్లు వెల్లడైంది. " 12 ఏళ్ల అందమైన కన్నెపిల్ల అమ్మకానికి ఉంది, ఆమె ధర ప్రస్తుతం 12,500 డాలర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది, త్వరపడండి' అంటూ ఇరాక్ దేశంలోని ఐసిస్ ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్రకటనలు వెళ్తున్నాయి.