యాప్నగరం

ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ రద్దు... నాలుగేళ్లలో ఐదోసారి ఎలక్షన్

ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ రద్దైంది. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలకు వెళ్తుంది. ఈ మేరకు నవంబర్ 1న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బెంజమిన్ నేతన్యాహూ తర్వాత ఏ ప్రభుత్వం కూడా కొన్నేళ్లపాటు సాగడం లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసిపోతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Authored byAndaluri Veni | Samayam Telugu 30 Jun 2022, 7:47 pm
Samayam Telugu ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ రద్దు... నాలుగేళ్లలో ఐదోసారి ఎలక్షన్
ఇజ్రాయెల్ ప్రభుత్వం మళ్లీ రద్దు అయింది. దీంతో నాలుగేళ్లలోనే ఇజ్రాయెల్‌లో ఐదోసారి ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల తేదీని కూడా ఇప్పుడే ఖరారు చేశారు. ఈ మేరకు నవంబర్ ఒకటో తేదీన ఎన్నికలకు వెళ్లేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. బెంజమిన్ నేతన్యాహూ 12 ఏళ్ల పాటు సుదీర్ఘ పాలన అనంతరం ఇజ్రాయెల్లో ప్రభుత్వాలు కనీసం పదిరోజులు కూడా కొనసాగడం లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అక్కడి ప్రభుత్వాల పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది.

పార్లమెంట్‌ రద్దుపై గురువారం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 92 మంది సభ్యులు ఓటేశారు. 120 సభ్యులు ఉండే పార్లమెంట్‌లో ఇంత భారీ సంఖ్యలో అంగీకారం రావడంతో వెంటనే పార్లమెంట్ రద్దు అవుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిగా కొనసాగిన యైర్ లాపిడ్ శుక్రవారం అర్థరాత్రి నుంచి తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. నవంబర్ ఒకటో తేదీన కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

సుదీర్ఘ కాలంలో ప్రభుత్వాన్ని నడిపించిన నేతాన్యాహూపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తర్వాత నుంచి ఇజ్రాయెల్ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. మెజారిటీతో పాలక కూటమిని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు సాధించడంలో పార్టీలు పదేపదే విఫలమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.