యాప్నగరం

పాపం చైనా.. ఆ ఉగ్రవాది మంచం మీద.. చావుబతుకుల్లో!

ఎవరినైతే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా అడ్డుపడిందో.. ఐక్య రాజ్య సమితిలో పదే పదే భారత ప్రయత్నాలకు మోకాలడ్డిందో.. ఆ ఉగ్రవాది ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Samayam Telugu 9 Oct 2018, 2:12 pm
పార్లమెంట్‌పై ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 50 ఏళ్ల అజహర్.. వెన్ను, కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. సొంతూరుతోపాటు పాకిస్థాన్‌లోని అతడెక్కడా కనిపించడం లేదు. దీంతో అతడి కోసం ఆరా తీయగా.. గత ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. జైషే మహ్మద్ బాధ్యతలను అతడి తమ్ముళ్లయిన రవూఫ్ అస్ఘర్, ఆథర్ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నారు.
Samayam Telugu masood azhar


2001లో పార్లమెంట్‌పై దాడితోపాటు.. 2005లో అయోధ్యపై దాడి, రెండేళ్ల క్రితం పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిలోనూ మసూద్ అజహరే ప్రధాన సూత్రధారి. అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఇండియా, అమెరికా ఐరాసలో ప్రయత్నిస్తుండగా.. చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు చైనా ససేమీరా అంటోంది. రకరకాల డిమాండ్లు మన ముందు పెడుతోంది. ఇకపై డ్రాగన్ డిమాండ్లకు భారత్ అంగీకరించాల్సిన అవసరం లేదు.

1999లో ఖాందహార్ హైజాక్ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ఉండటం కోసం భారత్ మసూద్ అజర్‌ను విడుదల చేసింది. ఈ హైజాకింగ్‌కు అజర్ సోదరుడు ఆథర్ ఇబ్రహం నేతృత్వం వహించాడు. ప్రస్తుతం ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రాంతం నుంచి అప్ఘాన్, బలూచిస్థాన్‌లపై ఉగ్రదాడులకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు.

అజర్ సోదరుడైన రవూఫ్ అస్ఘర్ భారత్‌‌‌లో, ముఖ్యంగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అస్ఘర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయాలని భారత్, అమెరికా భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.