యాప్నగరం

ఇవాంకా... ప్రేమ కోసం మతం మారింది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ వైట్‌హౌస్ ప్రధాన సలహాదారు హోదాలో హైదరాబాద్ వేదికగా ఈ నెల 28 న జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న విషయం తెలిసిందే.

TNN 23 Nov 2017, 1:44 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ వైట్‌హౌస్ ప్రధాన సలహాదారు హోదాలో హైదరాబాద్ వేదికగా ఈ నెల 28 న జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాంకా పర్యటన నేపథ్యంలో భాగ్యనగరం అందంగా ముస్తాబయ్యింది. గత నెల రోజులు నుంచి ఈ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చేది సాధారణ వ్యక్తి కాదు అగ్రరాజ్యాధిపతి కుమార్తె మరి. ఆమెతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు, ఇతర ప్రముఖులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Samayam Telugu jared kushner once broke up with ivanka trump over religion issue
ఇవాంకా... ప్రేమ కోసం మతం మారింది!


మరోవైపు అమెరికా భద్రతాధికారులు నెల రోజుల కిందటే హైదరాబాద్‌కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇవాంకా వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఆమె తన ప్రియుడి కోసం క్రైస్తవాన్ని వదలి జ్యూయిష్ మాతాన్ని స్వీకరించింది. న్యూయార్క్‌కు చెందిన వేండ్ డెంగ్ ముర్దోక్ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా 2005 ఆగస్టు 22 న జేడ్ కుష్నర్‌ను ఇవాంకా ట్రంప్ తొలిసారి కలిసింది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. అయితే ఈ విషయం తెలిసి, సంప్రదాయ యూదులైన కుష్నర్ కుటుంబం దీనికి అభ్యంతరం తెలపడంతో విడిపోయారు. అంతేకాదు ఓ సంపన్న వ్యక్తి కూతురు, మన లాంటి సాధారణ కుటుంబంలో ఎలా ఉండగలదని వారు అభిప్రాయపడ్డారు.

తమ ప్రేమకు మతం అడ్డంకిగా మారిందని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవాన్ని వదిలి యూదు మతం స్వీకరించింది. అలాగే తనకు అంతస్తులతో పనిలేదని తెలిపింది. దీంతో ఇవాంకాను తమ కొడలిగా చేసుకోడానికి కుష్నర్ తల్లిదండ్రులు చార్లెస్, సెర్యియల్ కుష్నర్ అంగీకరించారు. ఇవాంకా నిర్ణయానికి ట్రంప్ కూడా మద్దతు పలకడంతో 2009లో కుష్నర్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఇవాంకను కుష్నర్ ఎంతగానో ప్రేమించినా మతం అనే అంశం ప్రత్యేక పాత్ర పోషించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.