యాప్నగరం

కూచిభొట్ల శ్రీనివాస్‌ గౌరవార్థం..

అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలో మార్చి 16న ‘ఇండియన్‌ అమెరికన్‌ అప్రిసియేషన్‌ డే’గా పాటించారు.

TNN 17 Mar 2017, 7:04 pm
అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలో మార్చి 16న ‘ఇండియన్‌ అమెరికన్‌ అప్రిసియేషన్‌ డే’గా పాటించారు. ఇటీవల శ్వేతజాతీయుడి కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్‌ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ శామ్‌ బ్రౌన్‌బ్యాక్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయులు కృషి వల్లే కన్సాస్‌ ఉన్నత స్థానంలో ఉంది. అందుకు వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడకు భారతీయులు ఎప్పుడూ ఆహ్వానితులే’ అని పేర్కొన్నారు. ఇకపై జాత్యంహంకార దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Samayam Telugu kansas recognises march 16 as indian american appreciation day
కూచిభొట్ల శ్రీనివాస్‌ గౌరవార్థం..


భారతీయులపై దాడి జరుగుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి వారిని కాపాడటానికి ప్రయత్నించిన శ్వేత జాతీయుడు ఇయాన్‌ గ్రిల్లెట్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రిల్లెట్‌తో పాటు ఆడమ్‌ ఫ్యూరింటన్‌ దాడిలో గాయపడిన మదసాని అలోక్‌ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ అమెరికన్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.