యాప్నగరం

‘వృషణాలపై తన్నండి, గట్టిగా అరవండి’

ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎలాంటి సంకోచం లేకుండా రేపిస్టుల వృషణాలపై గట్టిగా తన్నడానికి ఏమాత్రం సంకోచించొద్దని స్కూల్ బాలికలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

Samayam Telugu 15 Oct 2018, 6:52 pm
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు గురవుతున్న ఆడపడుచుల సంఖ్య ఎక్కువ అవుతోంది. మన దగ్గరే కాదు, దక్షిణాఫ్రికాలోనూ మహిళలపై నేరాల సంఖ్య ఎక్కువ అవుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సౌతాఫ్రికాలో రోజుకు 110కిపైగా రేప్ కేసులు నమోదవుతున్నాయి. కానీ అంతకు మించి రేప్‌లు జరుగుతున్నాయని, 13 అత్యాచారాల్లో కేవలం ఒకటి మాత్రమే మాత్రమే పోలీసుల దృష్టికి వస్తోందని అధ్యయనాల్లో వెల్లడవుతోంది.
Samayam Telugu rape on minor


పరిస్థితి దారుణంగా ఉండటంతో.. కొన్ని ఎన్జీవోలు, చారిటీలు అప్రమత్తమయ్యాయి. ఆత్మరక్షణ, రేప్‌లను అడ్డుకోవడంపై బాలికలకు శిక్షణ ఇస్తున్నాయి. ఎలాంటి సంకోచం లేకుండా రేపిస్టుల వృషణాలపై మోకాలితో గట్టిగా తన్నండని స్కూలుకి వెళ్లే బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. ‘టార్గెట్’ మిస్ కాకుండా ఎలా దెబ్బతీయాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారి నుంచి కాపాడుకునేందుకు ఎలా స్పందించాలో చెబుతున్నారు.

ఎవరితోనైనా ఇబ్బంది అని భావిస్తే.. వారితో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మీపై ఎవరైనా దాడికి పాల్పడితే సాధ్యమైనంత గట్టిగా అరవండని చెబుతున్నారు. తోటి విద్యార్థినులపై ఎవరైనా దాడికి పాల్పడితే.. హీరోల్లా ఎలా రక్షించాలనే విషయమై అబ్బాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.