యాప్నగరం

తొమ్మిదేళ్ల శిక్షను 9 మాసాలుగా పొరబడి....

హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తికి కోర్టు తొమ్మిదేళ్లు శిక్షను విధిస్తే అధికారులు చేసిన పొరపాటు వల్ల నేరస్థుడు తొమ్మిది నెలలు మాత్రమే అనుభవించి బయటపడ్డాడు.

TNN 4 Jul 2017, 4:03 pm
హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తికి కోర్టు తొమ్మిదేళ్లు శిక్షను విధిస్తే అధికారులు చేసిన పొరపాటు వల్ల నేరస్థుడు తొమ్మిది నెలలు మాత్రమే అనుభవించి బయటపడ్డాడు. ఈ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. లండన్‌కి చెందిన రాల్స్‌టన్‌ అనే 25 ఏళ్ల యువకుడు 2016లో జెరెల్‌ హాలెండ్ అనే వ్యక్తిపై కత్తితో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో రాల్స్‌టన్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాల్స్‌టన్‌ నేరం చేసినట్లు అంగీకరించడంతో కోర్టు అతడికి తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధించింది. కానీ జైలు అధికారులు అతడు శిక్షను తొమ్మిదేళ్లకు బదులు పొరపాటున తొమ్మిది నెలలు అని రాసుకున్నారు.
Samayam Telugu knife thug sentenced to nine years in jail walks free after court staff write nine months
తొమ్మిదేళ్ల శిక్షను 9 మాసాలుగా పొరబడి....


తొమ్మిది నెలలు తర్వాత అతడి శిక్షాకాలం పూర్తయిందంటూ అధికారులు విడుదల చేశారు. తనపై హత్యాయత్నం చేసిన రాల్స్‌టన్‌ జైలు నుంచి విడుదలై హాయిగా తిరుగుతుండటం చూసిన జెరెల్‌ షాకతిన్నాడు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. కోర్టు తీర్పును తప్పుగా అర్థంచేసుకుని పోలీసులే ఈ తప్పిదం చేసినట్లు తేలింది. దీంతో స్థానికులు, అధికారులు పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా కుమారుడిని మూడుసార్లు కత్తితో పొడిచిన వ్యక్తికి కోర్టు తొమ్మిదేళ్లు శిక్ష విధిస్తే, తొమ్మిది నెలలని ఎలా అనుకుంటారని హాలెండ్ తండ్రి ఆవేశంగా అన్నారు. తనకి లాటరీ, క్రిస్టమస్ అన్ని ఒకేసారి వచ్చినట్లు భావిస్తున్నాడని నేరస్థుడి స్నేహితుడు అభిప్రాయపడ్డాడు. అంతేకాదు తనను ఎవరైనా గుర్తిస్తారని రహస్యంగా ఉంటున్నాడని తెలిపాడు. జైలు నుంచి విడుదలైన రాల్స్‌టన్‌ లండన్‌ నుంచి పారిపోయాడని, అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు మీడియా ద్వారా వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.