యాప్నగరం

స్కూళ్లో అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం

అంతా నిద్రలో ఉన్నారు. ఇంతలో చుట్టూ మంటలు.. తప్పించుకోలేని పరిస్థితి. బయటికి వచ్చే ప్రధాన ద్వారం కూడా మంటల్లో చిక్కుకుంది.

TNN 14 Sep 2017, 9:55 am
అంతా నిద్రలో ఉన్నారు. ఇంతలో చుట్టూ మంటలు.. తప్పించుకోలేని పరిస్థితి. బయటికి వచ్చే ప్రధాన ద్వారం కూడా మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రమాదం నుంచి బయటపడలేక 25 మంది అగ్నికి ఆహుతయ్యారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో గురువారం తెల్లవారుజామున అందరూ చూస్తుండగానే ఈ ఘోర సంఘటన జరిగింది.
Samayam Telugu kuala lumpur school fire kills at least 25
స్కూళ్లో అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవ దహనం


కౌలాలంపూర్‌లో ఉన్న ఓ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ అది. ఇందులో విద్యార్థులకు ఖురాన్‌కు సంబంధించిన మత బోధనలు చేస్తారు. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన బాలురకు ఇక్కడ బోధిస్తారు. స్కూల్ పై అంస్థులో డార్మెంటరీ ఉంది. అందులోనే విద్యార్థులు, స్కూల్ సిబ్బంది నిద్రిస్తారు. బుధవారం రాత్రి కూడా అదే విధంగా అందరూ నిద్రలోకి జారుకున్నారు. కానీ అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు వార్డెన్లు కాగా.. 23 మంది విద్యార్థులున్నారు.

ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది పాఠశాల వద్ద ఒక నోటీసును అతికించారు. ప్రమాదంలో 25 మంది చనిపోయారని, ఏడుగురుకి గాయాలు కాగా వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మరో 11 మందిని కాపాడినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నజీబ్‌ రజాక్‌ సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది సెల్‌ఫోన్లతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.