యాప్నగరం

పాక్‌లో కుల్‌భూషణ్‌ను కలిసిన భార్య, తల్లి

దేశద్రోహం, గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైళ్లో మగ్గుతున్న కుల్‌భూషణ్ జాదవ్ 22 నెలల తర్వాత ఎట్టకేలకు భార్య, తల్లిని కలిశాడు.

TNN 25 Dec 2017, 3:01 pm
దేశద్రోహం, గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైళ్లో మగ్గుతున్న కుల్‌భూషణ్ జాదవ్ 22 నెలల తర్వాత ఎట్టకేలకు భార్య, తల్లిని కలిశాడు. భారత్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ తల్లి, భార్య పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో అతణ్ని కలిశారు. అర గంటసేపు వారిద్దరూ కుల్‌భూషణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. దాదాపు రెండేళ్ల తర్వాత జాదవ్‌ను చూసిన భార్య, తల్లి ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్‌కుల్ జాదవ్‌తోపాటు భారత డిప్యూటీ హై కమిషనర్ కూడా పాక్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు.
Samayam Telugu kulbhushan jadhav meets his mother and wife at pak mofa
పాక్‌లో కుల్‌భూషణ్‌ను కలిసిన భార్య, తల్లి


మానవతా దృక్పథంతో కుల్‌భూషణ్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని భారత్ పదే పదే పాక్‌ను కోరింది. దీనికి స్పందించిన పాక్ తొలుత అతణ్ని కలిసేందుకు భార్యకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మరోసారి కోరడంతో అతడి తల్లిని కూడా అనుమతిచ్చింది.

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌లో అరెస్టయిన కుల్‌భూషణ్‌కు అక్కడి మిలటరీ కోర్టు గత ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తుది విచారణ పూర్తయ్యే వరకు అతడికి మరణశిక్ష అమలు చేయవద్దని ఐసీజే పాక్‌ను ఆదేశించింది. దీంతో ఆ దేశం వెనక్కి తగ్గింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.