యాప్నగరం

పాక్ సహా 5 దేశాలకి వీసాల జారీపై కువైట్ నిషేధం

పాకిస్థాన్ సహా అధికంగా ముస్లిం జనాభా గల 5 దేశాలకి వీసాల జారీపై కువైట్ నిషేధం విధించింది..

TNN 2 Feb 2017, 4:37 pm
పాకిస్థాన్ సహా అధికంగా ముస్లిం జనాభా గల 5 దేశాలకి వీసాల జారీపై కువైట్ నిషేధం విధించింది. కువైట్ నిషేధం విధించిన దేశాల జాబితాలో సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వున్నాయి. గత శుక్రవారం ఇదే తరహాలో అమెరికా ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన 7 దేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu kuwait bans visa for 5 countries including pakistan
పాక్ సహా 5 దేశాలకి వీసాల జారీపై కువైట్ నిషేధం


ఇదిలావుండగానే ఈ 5 దేశాలపై బ్యాన్ విధించిన కువైట్ ప్రభుత్వం... 'ఆయా దేశాలకి చెందిన పౌరులు తమ దేశం రావడానికి వీసాలకి దరఖాస్తు చేసుకోవద్దు' అని సూచించినట్టు తెలుస్తోంది. స్పట్నిక్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం... రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు తమ దేశానికి వలస వచ్చే ప్రమాదం వుందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. అమెరికా కన్నా ముందుగా కువైట్ 2011లోనే సిరియాపై నిషేధం విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.