యాప్నగరం

ఇంటెల్ వ్యవస్థాపకుడు కన్నుమూత

ఐటీ దిగ్గజం ఇంటెల్ సహవ్యవస్థాపకుడు ఆండీ గ్రోవ్ సోమవారం సాయంత్రం మరణించారు.

TNN 22 Mar 2016, 9:10 am
అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, ఐటీ దిగ్గజం ఇంటెల్ సహవ్యవస్థాపకుడు ఆండీ గ్రోవ్ సోమవారం సాయంత్రం మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఈ మేరకు ఇంటెల్ సంస్థ అధికారికంగా పేర్కొంది. ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదు. కానీ అనారోగ్యం వల్లే మరణించినట్టు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైనది. అందుకే అతడిని సిలికాన్ వ్యాలీ నిర్మాతగా పేర్కొంటారు. ఆయన రాబర్ట్ నాయిస్, గోర్డాన్ మూర్ తో కలిసి ఇంటెల్ ను స్థాపించారు. గ్రోవ్ మృతిపై బిల్ గేట్స్, టిమ్ కుక్ ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు.
Samayam Telugu legendary former intel ceo andy grove is dead
ఇంటెల్ వ్యవస్థాపకుడు కన్నుమూత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.