యాప్నగరం

లిబియా విమాన హైజాక్: ప్రయాణికుల విడుదల

లిబియా విమానం ఆ దేశంలోనే హైజాక్ అయిన సంగతి తెలిసిందే.

TNN 23 Dec 2016, 8:04 pm
లిబియా విమానం ఆ దేశంలోనే హైజాక్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఉగ్రవాదులు ఆ విమానాన్ని దారి మళ్లించి మాల్టా దీవిలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. వారి వద్ద గ్రేనేడ్లు, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నట్టు సమాచారం. దీంతో కొన్ని గంటల పాటూ ఏం జరుగుతుందో అని అందరి మొఖాల్లో ఒకటే ఉత్కంఠ. విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 118 మంది దాకా ఉన్నారు. విమానంలో ఉన్న ఉగ్రవాదులు ఎలాంటి డిమాండ్లు వెల్లడించలేదు. దీంతో అసలెందుకు హైజాక్ చేశారో తెలియలేదు. కాగా ఉగ్రవాదులు మొదటి విడతగా 25 మంది ప్రయాణికులను విడుదల చేశారు. కాసేపటికి రెండో విడతలో 65 మంది బందీలను విడుదల చేశారు. ప్రయాణికులను విమానం నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు బస్సులు వచ్చాయి. అందరినీ ఎయిర్ పోర్టు వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టాయి. 111 మంది ప్రయాణికుల్లో 109 మందిని విడుదల చేసేశారు ఉగ్రవాదులు. సిబ్బందిని, ఇద్దరు ప్రయాణికులను బందీలుగానే ఉంచుకున్నారు. వారిని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Samayam Telugu libyan plane hijack all passengers released
లిబియా విమాన హైజాక్: ప్రయాణికుల విడుదల


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.